3, ఆగస్టు 2020, సోమవారం

నా లక్ష్యం సులభం. ఇది విశ్వంపై పూర్తి అవగాహన, అది ఎందుకు ఉంది మరియు ఎందుకు ఉనికిలో ఉంది.

స్టీఫెన్ హాకింగ్


శరీరంలో అన్ని అవయవాలు ఉండి కూడా ఏదో ఒక కారణంతో జీవితాన్ని నాశనం చేసుకుంటున్న ఈ రోజుల్లో, శరీరంలో అవయవాలు అన్ని ఒక దాని తర్వాత ఒకటి చచ్చుబడిపోతున్న గాని తను అనుకున్న లక్షాన్ని సాధించుకోవడం కోసం ఎంతో పట్టుదలతో, శ్రమతో ముందుకు సాగి వేల మంది జీవితాలకు ఒక మార్గదర్శకునిలా నిలిచిన వ్యక్తి స్టీఫెన్ హాకింగ్. 



స్టీఫెన్ హాకింగ్ 1942లో ఇంగ్లాండ్ లోని ఆక్స్ఫర్డ్ లో జన్మించాడు. స్టీఫెన్ లండన్ లోని హైగేట్స్ ప్రాంతంలో తన చదువును ప్రారంభించాడు. ఆ తర్వాత భౌతిక శాస్త్రంలో స్పెషలైజేషన్ చేస్తాడు. ఒక సారి  స్టీఫెన్ తను చదివే కాలేజీలో నడుస్తూ నడుస్తూ క్రిందపడిపోతాడు. అప్పటి నుండి అతను నడవడానికి చాలా ఇబ్బంది పడేవాడు. అతని నడవడికలో మార్పును చుసిన 
అతని తల్లి అతనిని హాస్పిటల్లో జాయిన్ చేస్తుంది.

అక్కడి డాక్టర్లు అతనికి ఎన్నో టెస్టులు చేస్తారు. చివరికి అతను మరో రెండు సంవత్సరాలు మాత్రమే బ్రతుకుతాడు అని చెప్తారు. అప్పటికే అతను జానే అనే అమ్మాయితో ప్రేమలో ఉంటాడు. అతను ఇంకా కొన్ని రోజుల్లో చనిపోతాడు అని తెలిసి కూడా ఆమె అతనిని విడిచిపెట్టదు. అలా వాళిద్దరూ కలిసి పెళ్లి చేసుకుంటారు. అతనికి వచ్చిన ఈ రోగం కారణంగా అతను చాలా రోజులు ఇంటికే పరిమితమవుతాడు.


కాని అతనికి చదువుపై ఉన్న ఇష్టం అతడిని మళ్ళీ కాలేజీకి వెళ్లేలా చేస్తుంది. ఎన్ని కష్టాలు ఎదురైనా, అతను మాత్రం వెనకడుగు వేయకూడదు అని అనుకుంటాడు. జీవితం అంటే ఎటువంటి అవధులు, హద్దులు లేనిదని అతని అభిప్రాయం. 

శరీరంలో అవయవాలు ఒకదాని తర్వాత ఇంకొకటి చచ్చుబడి పోతున్న స్టీఫెన్ బాధపడడు. కసిగా చదువుకుని శాస్త్రవేత్త అవుతాడు. అలా హాకింగ్ తన పరిశోధనల ద్వారా క్వాంటమ్ థియరీని ప్రతిపాదిస్తాడు. అంతే కాకుండా బ్లాక్ హోల్స్ (కృష్ణ బిలాలు) గురించి ప్రతిపాదిస్తాడు.

 

1974లో స్టీఫెన్ హాకింగ్ ఈ బ్లాక్ హోల్స్ పూర్తిగా నల్లగా ఉండవని, వీటి యొక్క నిర్దిష్ట ఉష్ణోగ్రత వద్ద చిన్న మొత్తంలో ఉష్ణవికిరణాన్ని విడుదల చేస్తాయని చెప్తాడు. ఇలా విడుదల అయిన ఈ రేడియేషన్ కు హాకింగ్ రేడియేషన్ అని పేరు పెట్టాడు.  

శాస్త్రపరిశోధనలలో పూర్తిగా మునిగియున్న స్టీఫెన్ కు తన నోరు కూడా పని చేయడం మానేస్తుంది. దాని వల్ల అతను మాట్లాడలేకపోతాడు. అలా మాట్లాడడం కష్టంగా అయిపోయిన స్టీఫెన్ కోసం ఇంటెల్ కంపెనీ ఒక పరికరాన్ని తయారు చేస్తుంది. ఈ పరికరం అతని యొక్క నరాల కదలికల ద్వారా అతను ఏం మాట్లాడాలనుకుంటున్నాడో అది అందరికి తెలిసేలా చేస్తుంది. స్టీఫెన్ హాకింగ్ యొక్క చిరకాల కోరిక విశ్వంలోకి వెళ్లడం. కాని తనకున్న అవిటితనం వల్ల అతనిని విశ్వంలోకి పంపడానికి శాస్త్రవేత్తలు అంగీకరించరు.

ఒకసారి ఈయూ మాండిస్ అనే బిజినెస్ మాన్ స్టీఫెన్ ను కలవడానికి వస్తాడు. స్టీఫెన్ హాకింగ్ అతనితో తనకు విశ్వంలోకి వెళ్లాలని ఉంది అని చెప్తాడు. అయితే మాండిస్ తనను విశ్వంలోకి తీసుకొని వెళ్ళలేను గాని జీరో గ్రావిటీ స్పేస్ లోకి తీసుకువెళ్తానంటాడు. అలా స్టీఫెన్ హాకింగ్ జీరో గ్రావిటీ స్పేస్ లో విహరిస్తాడు. 

అలా శాస్త్ర పరిశోధనలలో నిమగ్నమైన స్టీఫెన్ హాకింగ్ 2018లో కేంబ్రిడ్జి లోని తన నివాసంలో మరణించాడు.

స్టీఫెన్ హాకింగ్ వచనాలు :


మేధస్సు అనేది మార్పుకు అనుగుణంగా ఉండే సామర్ధ్యం.

మీరు ఎల్లప్పుడూ కోపంగా లేదా ఫిర్యాదు చేస్తే ప్రజలకు మీ కోసం సమయం ఉండదు.

నాకు అవగాహన లేదు. వారి మేధస్సు  గురించి ప్రగల్భాలు పలికే వ్యక్తులు ఓడిపోతారు.

నా లక్ష్యం సులభం. ఇది విశ్వంపై పూర్తి అవగాహన, అది ఎందుకు ఉంది మరియు ఎందుకు ఉనికిలో ఉంది.

కోరిన కోర్కెలు తీర్చే కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి.

కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి పూర్వం ద్వారకుడు అనే వ్యక్తి ప్రతి యేటా భక్తి శ్రద్ధలతో ఆ తిరుమల వేంకటేశ్వర స్వామిని దర్శించుకునేవాడు. అయ...