31, అక్టోబర్ 2020, శనివారం

తదుపరి పెద్ద సృష్టి ఏమిటో గుర్తించడం ద్వారా మనం దేనిపై దృష్టి పెట్టాలి అనేది తెలుస్తుంది.

మార్క్ జూకర్ బర్గ్


మార్క్ జూకర్ బర్గ్ చదువుకునే వయసులోనే సాఫ్ట్ వేర్ ని తయారుచేసి దాన్ని అతితక్కువ సమయంలోనే ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందేలా చేసాడు. అలా తాను తయారుచేసిన సాఫ్ట్ వేర్ పై విడదీయరాని అనుబంధాన్ని ఏర్పరుచుకుని, ఒకానొక సమయంలో తన స్నేహితుల ఒత్తిడి వల్ల ఆ సాఫ్ట్ వేర్ ని అమ్మవలసి వచ్చినా గాని అమ్మకుండా ఈ రోజు ప్రపంచంలోని 10 మంది కుబేరుల జాబితాలో ఒకడిగా నిలిచాడు. జూకర్ బర్గ్ ప్రస్తుతం ఫేస్ బుక్ సంస్థకు సీఈఓ గా వ్యవహరిస్తున్నాడు. మరియు వాట్సాప్, ఇన్ స్టాగ్రామ్, మెసెంజర్, ఒకులస్ వీ ఆర్ అనే సంస్థలకు అధినేత. 
 

బాల్యం మరియు విధ్యాబ్యాసం :


మార్క్ జూకర్ బర్గ్ అసలు పేరు మార్క్ ఇలియట్ జూకర్ బర్గ్. ఇతను 1984 మే 14న న్యూయార్కులోని వైట్ ప్లైన్స్ నగరంలో జన్మించాడు. అతని తల్లిదండ్రులు ఎడ్వర్డ్ జూకర్ బర్గ్, కరెన్. జూకర్ బర్గ్ తన చదువును అర్ద్ స్లే స్కూల్ మరియు ఫిలిప్స్ ఎక్సటర్ అకాడమీలో పూర్తి చేసాడు. ఆ తర్వాత హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో చేరతాడు. కాని తన చదువు పూర్తి కాకుండా మధ్యలోనే  వదిలేస్తాడు. 


వ్యక్తిగత విషయాలు :


జూకర్ బర్గ్ 2003లో తన ప్రస్తుత భార్య అయిన ప్రిస్కిల్లా చాన్ ని కలుస్తాడు. ఆమెను కలిసిన కొన్ని రోజులకే వాళ్లిదరి మధ్య విడదీయరాని అనుబంధం ఏర్పడుతుంది. అలా ఆ బంధం ప్రేమగా మారుతుంది. తొమ్మిది సంవత్సరాల పాటు కలిసి ఉన్న వాళ్ళు 2012లో పెద్దల సమక్షంలో ఒకటవుతారు. వీళ్ళ పెళ్లితో పాటు చాన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఫంక్షన్ కూడా ఇక్కడే చేసుకుంటారు. వీళ్లకు ఇద్దరు పిల్లలు పుట్టారు.

ఫేస్ బుక్ :


ఫేస్ బుక్ సాఫ్ట్ వేర్ ని 2004 ఫిబ్రవరి 4న కేంబ్రిడ్జ్ లో మార్క్ జూకర్ బర్గ్, ఎడార్డ్ ఓ సావేరిన్, ఆండ్రూ మెకల్లమ్, డస్టిన్ మోస్కోవిట్జ్, క్రిస్ హ్యూగ్స్ కనిపెట్టారు. ఫేస్ బుక్ ముఖ్య కార్యాలయం మెన్లో పార్క్ , కాలిఫోర్నియాలో ఉంది. ఈ ఫేస్ బుక్ ని ఫొటోస్ మరియు ముఖ్యమైన సందేశాల షేరింగ్ ద్వారా ఒకరితో ఒకరికి సత్సంబంధాలు పెరగడం కోసం ఉపయోగించేవారు.  మొదట్లో ఫేస్ బుక్ ని కొన్ని అమెరికన్ విశ్వవిద్యాలయాలలో మాత్రమే ఉపయోగించేవారు. ఫేస్ బుక్ అమెరికాలోని విశ్వవిద్యాలయాలలో సక్సెస్ అవ్వడంతో ఫేస్ బుక్ ని పబ్లిక్ లోకి తీసుకువెళ్ళడానికి సిద్ధమవుతారు. అందుకోసం కాలిఫోర్నియాలో ఒక చిన్న ఆఫీస్ అద్దెకు తీసుకుని అక్కడ కంపెనీని స్టార్ట్ చేస్తారు. అలా ఫేస్ బుక్ సాఫ్ట్ వేర్ ని పబ్లిక్ లోకి లాంచ్ చేసిన కొన్ని సంవత్సరాలకే ప్రపంచ వ్యాప్తంగా వినియోగదారులను సంపాదించుకుంటుంది. అంతేకాకుండా ఫేస్ బుక్ సంస్థలో పెట్టుబడులు పెట్టిన వారు అతి తక్కువ సమయంలోనే అపర కుబేరులుగా మారిపోయారు. అలా జూన్ 30, 2020 నాటికి ఫేస్ బుక్ లో 52,534 మంది పని చేస్తున్నారు. ఈ ఫేస్ బుక్ కు ప్రస్తుత సీఈఓ గా మార్క్ జూకర్ బర్గ్, సిఓఓ గా షెరిల్ సాండ్బర్గ్, సిఎఫ్ఓ గా డేవిడ్ వెహ్నేర్, సిటిఓ గా మైక్ స్క్రాప్ఫర్, సిపిఓ గా క్రిస్ కాక్స్ పని చేస్తున్నారు. 

ఫేస్ బుక్ ను లాంచ్ చేసిన కొన్ని సంవత్సరాలకు ఫేస్ బుక్ మెసెంజర్ ను కూడా స్టార్ట్ చేసారు. ఈ ఫేస్ బుక్ మెసెంజర్ ను వాట్సాప్ మాదిరిగా సందేశాల షేరింగ్ కోసం వినియోగిస్తారు. మార్క్ జూకర్ బర్గ్ వాట్సాప్ కంపెనీని 2014లో 19 బిలియన్ డాలర్స్ కు కొనుగోలు చేసాడు. అంతే కాకుండా ఇన్ స్టాగ్రామ్ ను 2012లో 1 బిలియన్ డాలర్స్ కు కొనుగోలు చేసాడు.

జూకర్ బర్గ్ తన భార్య చాన్ తో కలిసి చాన్ జూకర్ బర్గ్ ఇనిషియేటివ్ అనే సేవా సంస్థను స్థాపించాడు. జూకర్ బర్గ్ ఈ  చాన్ జూకర్ బర్గ్ ఇనిషియేటివ్ సేవా సంస్థ ద్వారా ఎన్నో దేశాలలో సేవా కార్యక్రమాలు చేస్తున్నాడు.

దానాలు :


2010లో గివింగ్ ప్లెడ్జ్ ద్వారా ఫేస్ బుక్ ఫౌండర్ మార్క్  జూకర్ బర్గ్, బెర్కషైర్ హతవే ఫౌండర్ బఫెట్, మైక్రోసాఫ్ట్  ఫౌండర్ బిల్ గేట్స్ తమ ఆదాయంలో 50 శాతం సేవా కార్యక్రమాలకు వినియోగించాలని ప్రమాణం చేసారు.

2014లో జూకర్ బర్గ్, చాన్ జూకర్ బర్గ్ ఇనిషియేటివ్ ద్వారా ఎబోలా వైరస్ డిసీస్ ట్రీట్మెంట్ అందించడం కోసం 25 మిలియన్ డాలర్లను దానం చేసాడు.

2015లో జూకర్ బర్గ్, చాన్ జూకర్ బర్గ్ ఇనిషియేటివ్ కు తమ సంపాదనలో 99 శాతం వాటాను ఇవ్వడం ద్వారా ఎంతో మందికి మంచి చదువు, ఆరోగ్యాన్ని ప్రసాదించాడు. 

జూకర్ బర్గ్, సెప్టెంబర్ 2020 నాటికి 111 బిలియన్ డాలర్లతో ప్రపంచ కుబేరుల జాబితాలో 4వ స్థానంలో నిలిచాడు.

28, అక్టోబర్ 2020, బుధవారం

తన అందంతో ,ఆకృతితో కోట్ల మంది వీక్షకులను కట్టిపడేసిన కట్టడం ఈఫిల్ టవర్.

ఈఫిల్ టవర్


ప్రపంచంలోని అతి పెద్ద కట్టడాలలో ఒకటైన కట్టడం, కోట్ల మందిని తన అందంతో కట్టిపడేసిన కట్టడం, కట్టి ఎన్నో సంవత్సరాలైనా చెక్కు చెదరకుండా బలంగా నిలబడిన కట్టడం, చరిత్రలో తన కంటూ ఒక ప్రముఖ స్థానాన్ని దక్కించుకున్న కట్టడం, జీవితంలో ఒకసారైనా చూడాల్సిన కట్టడం ప్యారిస్ లో నిర్మించబడిన ఈఫిల్ టవర్ కట్టడం.


ఈఫిల్ టవర్ చరిత్ర :


ఈ ఈఫిల్ టవర్ ఫ్రాన్స్ దేశం, ప్యారిస్ నగరంలోని చాంప్ డే మార్స్ లో ఉంది. ఈ ఈఫిల్ టవర్ ని చేత ఇనుప జాలకం తో నిర్మించారు. ఈ ఈఫిల్ టవర్ ప్రపంచంలోనే 2వ అతి పెద్ద టవర్ గా కీర్తిని గడించింది. 

మారిస్ కొచ్లిన్ మరియు ఎమిలే నౌగియర్ అనే ఇద్దరు డిజైనర్స్  సొసైటీ డి ఎక్స్ప్లోయిటేషన్ డి లా టూర్ ఈఫిల్ అనే కంపెనీలో పని చేసేవారు. ఈ కంపెనీకి బాస్ గుస్తావే ఈఫిల్. వీళ్ళిద్దరూ ఈఫిల్ టవర్ యొక్క డిజైనును రూపొందించారు. డిజైన్ పూర్తయిన వెంటనే ఆ ఇద్దరు డిజైనర్స్ ఆ డిజైన్ ను తమ బాస్ అయిన ఈఫిల్ కి చూపిస్తారు, ఆ డిజైన్ చూసిన ఈఫిల్ కొన్ని మార్పులను చేయమంటాడు. అప్పుడు డిజైనర్స్ ఇద్దరు స్టీఫెన్ సౌవేస్టర్ తో కలిసి బేస్ డిజైన్, డెకరేషన్స్ చేసి పూర్తి డిజైన్ ని ఈఫిల్ కి చూపించి ఆమోదాన్ని పొందుతారు. అసలు ఈ టవర్ కట్టడానికి ప్రధాన కారకుడు ఈఫిల్. ఈఫిల్ న్యూ యార్క్ లో ఉన్నలాటింగ్ అబ్జర్వేటరీ కట్టడాన్ని ప్రేరణగా తీసుకుని దీన్ని నిర్మించాలని అనుకున్నాడు.

ఈఫిల్ ఆమోదాన్ని పొందిన ఈ టవర్ యొక్క ఎత్తు 300 మీటర్లుగా నిర్దారిస్తారు. అయితే మొదట్లో 300 మీటర్ల ఎత్తు గల భవనం యొక్క నిర్మాణం సాధ్యం కాదని అందరూ అనేవారు, కొంతమంది నేరుగానే టవర్ ని నిర్మించాలనుకున్న ఈఫిల్ ని విమర్శించేవారు. కాని ఈఫిల్ వాటిని లెక్క చేయలేదు. ప్రపంచంలోనే అతి పెద్ద టవర్ ని నిర్మించడమే తన లక్ష్యంగా పెట్టుకున్నాడు. అనుకున్నదే తడువుగా ప్రణాళికలను రూపొందించి పనులను చకచకా ముందుకు నడిపించాడు. అయితే ఈ టవర్ యొక్క డిజైన్ నాలుగు వేరువేరు లాటిస్ గిర్డర్ స్థంబాలపై నిలబడి చివర్లో కలిసినట్టుగా ఉండేలా రూపొందించారు.

ఈఫిల్ ఈ డిజైన్ కి ఆమోదాన్ని పొందడమే కాకుండా దీన్ని ఆర్ట్స్ డిజైన్ ఎక్సిబిషన్ లో ప్రదర్శిస్తాడు. అలా మార్చి 30, 1885 న, ఈఫిల్ తన ప్రణాళికలను సొసైటీ డెస్ ఇంజినియర్స్ సివిల్స్‌కు సమర్పిస్తాడు. సాంకేతిక సమస్యలను చర్చించిన తరువాత మరియు టవర్ యొక్క ఆచరణాత్మక ఉపయోగాలను నొక్కిచెప్పిన తరువాత, టవర్ ప్రతీకను గురించి చెప్పి తన ప్రసంగాన్ని ముగిస్తాడు. అలా ఎన్నో ఆమోదాలు పొందిన తర్వాత 28 జనవరి 1887లో ఈ ఈఫిల్ టవర్ కట్టడాన్ని నిర్మించడం మొదలు పెడతారు. 2 సంవత్సరాల పాటు అలుపెరగని నిర్మాణాన్ని జరిపి చివరకు 15 మార్చి 1889లో టవర్ యొక్క నిర్మాణం పూర్తి చేస్తారు. 31 మార్చి 1889లో ఈ ఈఫిల్ టవర్ ని ప్రారంభించారు. ఈఫిల్ టవర్ పై ఏర్పరచిన టిప్ తో కలిసి ఈ టవర్ యొక్క మొత్తం పొడవు 324 మీటర్లుగా నిర్దారించారు.

ఈ టవర్ సందర్శకుల సౌకర్యార్ధం కోసం మూడు స్థాయిలుగా విభజించబడింది. మొదటి స్థాయికి రెండవ స్థాయికి వెళ్ళడానికి మెట్ల సౌకర్యం ఉంది. మొదటి రెండు స్థాయిలలో రెస్టారెంట్స్ ఉంటాయి. మూడవ స్థాయికి వెళ్ళడానికి కూడా మెట్లు ఉన్నాయి కాని ఎక్కువ దూరం కావడం వల్ల సందర్శకులు లిఫ్ట్ లోనే వెళ్తారు. భూమి నుండి మూడవ స్థాయికి ఈ టవర్ ఎత్తు 276 మీటర్లుగా ఉంది.

2015వ సంవత్సరంలో డబ్బులు కట్టి సందర్శించే కట్టడాల్లో 69 లక్షల మంది సందర్శించిన 
అద్భుత కట్టడంగా చరిత్రలో నిలిచింది.

25, అక్టోబర్ 2020, ఆదివారం

మీరు అందరిలాగే ఉండబోతున్నట్లయితే ఈ భూమిపై మనం ఉన్నదానికి అర్ధం ఏముంటుంది.

ఆర్నాల్డ్ స్క్వార్జెనెగ్గర్


ప్రొద్దుట లేచినప్పటి నుండి మరలా రాత్రి పడుకునేంత వరకు రకరకాల ఆలోచనలతో, బాధలతో జీవితాన్ని గడుపుతాం. అటువంటి ఈ జీవితంలో ఏదైనా సాధించాలి, గొప్పగా అవ్వాలి అనుకుంటే మనల్ని ముందుగా పలకరించేవి భయం, అసమర్ధత, నా వల్ల అవుతుందా, నేను సాధించగలనా అనే అనుమానాలే. ఈ ఆధునిక ప్రపంచంలో ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఆవిష్కరణలు, కొత్త కొత్త బ్రాండ్లు రోజుకొకటి పుట్టుకొస్తున్నాయి. అటువంటి ఈ ప్రపంచంలో నీ వల్ల కాదు, నీ వల్ల కాదు అని మనల్ని మనం అసమర్థులుగా మార్చుకుంటున్నాం. ఏదైనా పనిని మొదలు పెట్టి అందులో ఓడిపోతే మన వల్ల కాదు, మనం ఇంకా ఏమి సాధించలేం అని అనుకుంటూ మనల్ని మనం కించపరుచుకుంటూ ముందుకు నడుస్తుంటామ్. అటువంటి ఈ సమాజంలో  పుట్టి చిన్న వయసులోనే బాడీ బిల్డర్ అవ్వాలనే లక్ష్యంతో అమెరికా వచ్చి అక్కడి పోటీల్లో పాల్గొని ప్రపంచ నెంబర్.1 బాడీ బిల్డర్ అవ్వడం. సినిమాలలో నటించి నెంబర్.1 అనిపించుకోవడం. అమెరికా రాజకీయాలలోకి ప్రవేశించి గవర్నర్ గా పదవిని చేపట్టడం. ఎన్నో సార్లు మరెన్నో సార్లు ఓడిపోయినా మళ్ళీ ప్రయత్నించడం. తాను ఏదైతే కావాలనుకున్నాడో, ఏదైతే సాధించాలనుకున్నాడో దాని కోసం బలమైన సంకల్పంతో, కసితో ముందుకు సాగడం. ఇలా అన్ని విషయాలలోను గొప్పగా నిలిచిన అతను మరెవరో కాదు ప్రముఖ బాడీ బిల్డర్, యాక్టర్, రాజకీయవేత్త, వ్యాపారవేత్త అయిన ఆర్నాల్డ్ స్క్వార్జెనెగ్గర్.  



బాల్యం మరియు విధ్యాబ్యాసం :


ఆర్నాల్డ్ స్క్వార్జెనెగ్గర్ అసలు పేరు ఆర్నాల్డ్ అలోయిస్ స్క్వార్జెనెగ్గర్. ఇతను 30 జులై 1947లో ఆస్ట్రియా దేశంలో జన్మించాడు. ఇతను ఆరేలియా మరియు గుస్తావ్ స్క్వార్జెనెగ్గర్ అనే దంపతులకు జన్మించాడు. ఆర్నాల్డ్  తన చదువును ట్రేడ్ స్కూల్ లో పూర్తి చేసాడు. శాంటా మోనిక కాలేజీ యూనివర్సిటీ అఫ్ విస్కాన్సిన్ సుపీరియర్ లో బి.ఏ పూర్తి చేసాడు.

 

వక్తిగత విషయాలు :


ఆర్నాల్డ్ 1986వ సంవత్సరంలో మరియా శ్రీవేర్ అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీళ్లకు నలుగురు పిల్లలు పుట్టారు. 2011వ సంవత్సరంలో వీళ్ళద్దరు విడిపోయారు. 2015 వ సంవత్సరం నుండి తన కంటే వయసులో 27 ఏళ్ళ చిన్నదైన హీథర్ మిల్లిగాన్ అనే అమ్మాయితో సహజీవనం చేస్తున్నాడు. 


 బాడీ బిల్డింగ్ :


బాడీ బిల్డింగ్ చరిత్రలో తమకంటూ గొప్ప గుర్తింపును సంపాదించుకున్న వారిలో ఆర్నాల్డ్ ముందు వరసలో ఉంటాడు. ఆర్నాల్డ్ తన 14 ఏళ్ళ వయసులో ఒలింపిక్స్ గేమ్స్  కోసం వెయిట్ లిఫ్టింగ్ చేయడం మొదలు పెట్టాడు. ఆర్నాల్డ్ 15 ఏళ్ళ వయసులోనే అద్భుతమైన శరీరాన్ని తన సొంతం చేసుకున్నాడు. హాలీవుడ్ యాక్టర్స్ చాలా మంది ముందు బాడీబిల్డర్లు అయ్యి ఆ తర్వాత హీరోస్ గా మారారు అలానే ఆర్నాల్డ్ కూడా అవ్వాలనుకుంటాడు. అలా తన 18 ఏళ్ళ వయసులో ఆస్ట్రియా నుండి అమెరికా వచ్చేస్తాడు. అమెరికా వచ్చిన ఆర్నాల్డ్ ప్రొఫెషనల్ బాడీ బిల్డర్ అవ్వాలనే కసితో రోజుకు 6 గంటలు కష్టపడే వాడు. తనలో ఉన్న పట్టుదలను చుసిన బాడీ బిల్డింగ్ ట్రైనర్ జోయీ వెల్డర్ ఆర్నాల్డ్ ని  గొప్పగా ప్రోత్సహించేవాడు. 

అలా ఆర్నాల్డ్ 2 సార్లు పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్ గాను, 2 సార్లు వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్ గాను ఎన్నికయ్యాడు. అంతే కాకుండా మిస్టర్ యూనివర్స్ గా 4 సార్లు ఎన్నికయ్యాడు. 7 సార్లు మిస్టర్ ఒలింపియా గా కూడా ఎన్నికయ్యాడు. 

1980వ సంవత్సరంలో తన 33వ యేట బాడీబిల్డింగ్ కి రిటైర్మెంట్ ప్రకటించాడు. 

అమెరికాలో ప్రతి ఏటా ఆర్నాల్డ్ క్లాసిక్ అనే పేరుతో బాడీబిల్డింగ్ ఛాంపియన్ షిప్ ని నిర్వహిస్తున్నారు. 

సినిమా యాక్టింగ్ :


బాడీబిల్డర్ గా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ఆర్నాల్డ్  1970లో హెర్క్యూలేస్ ఇన్ న్యూ యార్క్ అనే సినిమాతో హాలీవుడ్ లో అడుగుపెట్టాడు. అయితే తను మొదటి నుండి బాడీబిల్డర్ కావడంతో యాక్టింగ్ చేయడం చాలా ఇబ్బందయ్యేదని, తన భాష కూడా సరిగ్గా ఎవరికి అర్ధమయ్యేది కాదని ఆర్నాల్డ్ పలు ఇంటర్వూస్ లో చెప్పాడు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా గాని పట్టుదలతో ప్రయత్నించి హాలీవుడ్ సినిమా ప్రపంచంలో తనకంటూ ఒక గొప్ప స్థానాన్ని సంపాదించుకున్నాడు. అలా హాలీవుడ్ హిట్ మూవీస్ అయిన స్టే హంగ్రీ, పంపింగ్ ఐరన్, ది విలన్, ది టెర్మినేటర్, ది రన్నింగ్ మాన్, ట్విన్స్, టోటల్ రీకాల్, టెర్మినేటర్ 2, జూనియర్, ట్రూ లైస్, ఎరేజర్, టెర్మినేటర్ 3, ఎక్సపండబుల్స్, ఎక్సపండబుల్స్ 2, టెర్మినేటర్ డార్క్ ఫేట్ లాంటి ఎన్నో గొప్ప చిత్రాలలో నటించాడు. 

రాజకీయ జీవితం :


ఆర్నాల్డ్ మొట్టమొదటగా అమెరికా వచ్చిన కొత్తలో రిపబ్లికన్ పార్టీ సమావేశాల్లో అధ్యక్ష అభ్యర్థి అయిన నిక్సన్-హంఫ్రీ మాట్లాడడం విన్నాడు. ఆయన సోషలిజం విధానాలతో మాట్లాడడం, స్వేచ్ఛ హక్కుల గురించి మాట్లాడడం, పన్నులు తగ్గించడం, మిలటరీ బలోపేతం గురించి మాట్లాడడం ఇవన్ని ఆర్నాల్డ్ లో తెలియని ఉద్రేకాన్ని కలిగించాయి. అలా తన ఆలోచనలకు తగ్గట్టుగా అతను మాట్లాడం ఆర్నాల్డ్ కి రిపబ్లికన్ పార్టీ పై, హంఫ్రీ పై ఇష్టాన్ని పెంచాయి. అలా ఆర్నాల్డ్ తనను రిపబ్లికన్ మెంబర్ గా అనుకునేవాడు. 

ఆర్నాల్డ్ 1988 ప్రెసిడెంట్ ఎలక్షన్ కాంపెయిన్ లో తను రిపబ్లికన్ మెంబర్ అని ప్రకటించాడు. 
1990 నుండి 1993 వరకు ప్రెసిడెంట్ కౌన్సిల్ ఆన్ ఫీజికల్ ఫిటినెస్ అండ్ స్పోర్ట్స్ విభాగంలో చైర్మన్ గా పనిచేసాడు. 
ఆ తర్వాత గవర్నర్ పెట్ విల్సన్ ఆధ్వర్యంలో నడుస్తున్న క్యాలిఫోర్నియా గవర్నర్ కౌన్సిల్ ఆన్ ఫిజికల్ ఫిటినెస్ అండ్ స్పోర్ట్స్ విభాగంలో ఛైర్మన్ గా పనిచేసాడు. 
1993 నుండి 1994 వరకు రెడ్ క్రాస్ అంబాసిడర్ గా పనిచేసాడు. 
ఇలా ఎన్నో విభాగాలలో రిపబ్లికన్ పార్టీ ద్వారా సేవలందించిన ఆర్నాల్డ్ క్యాలిఫోర్నియా గవర్నర్ గా 2003 నుండి 2011 వరకు పనిచేసాడు. 

వ్యాపారాలు :


బాడీబిల్డర్, సినిమా యాక్టర్, బిజినెస్ మాన్ గానే కాకుండా వ్యాపార రంగంలోను ఆర్నాల్డ్ తనకంటూ ఒక గుర్తింపును సంపాదించుకున్నాడు. 
తను బాడీబిల్డింగ్ చేస్తున్న సమయంలోనే బ్రిక్ వ్యాపారం మొదలు పెట్టి తన మొదటి వ్యాపారంలో గొప్పగా విజయం సాధించాడు. 
రియల్ ఎస్టేట్ వ్యాపారంలో కూడా తనకంటూ ఒక ముద్ర వేసుకున్నాడు. 
1992 లో తన భార్యతో కలిసి రెస్టారెంట్ బిజినెస్ మొదలు పెట్టి విజయం సాధించాడు. 
అలా 2006 నాటికి ఆర్నాల్డ్ నికర ఆదాయం 800 మిలియన్ డాలర్లకు చేరింది. 

22, అక్టోబర్ 2020, గురువారం

జీవితం మారథాన్, స్ప్రింట్ కాదు.

ఇవాంకా ట్రంప్


ఆడవాళ్ళని చూడగానే ముందుగా కనిపించేది వాళ్ళ యొక్క అందం. వారి యొక్క  అందంతో ఎదుటివారిని చూపు తిప్పుకోనివ్వకుండా చేసి తమవైపు ఆకర్షించుకునే శక్తి వారి సొంతం. ఎన్నో యుద్ధాలను జయించిన వీరుడైనా సరే ఆడవాళ్ళ అందానికి దాసోహం కావలిసిందే. అయితే కొంతమంది మహిళలు తమ అందంతోనే కాకుండా మంచి పనితనం చూపడం ద్వారా తమకు తామే సాటి అని నిరూపించుకుంటున్నారు. అంతే కాకుండా ఈనాటి మహిళలు రాజకీయాలలోను, వ్యాపారాలలోను మెరుగ్గా రాణిస్తూ అందరిచేత మన్ననలు పొందుతున్నారు. అటువంటి వారిలో ప్రధానంగా మాట్లాడుకోవాల్సిన మహిళ, అమెరికా ప్రస్తుత అధ్యక్షుడైన డోనాల్డ్ ట్రంప్ కూతురు మరియు అతని ప్రధాన సలహాదారు, పారిశ్రామికవేత్త అయిన ఇవాంకా ట్రంప్.    



బాల్యం మరియు విధ్యాబ్యాసం :


ఇవాంకా ట్రంప్ అసలు పేరు ఇవానా మేరీ ట్రంప్ . ఇవాంకా 30 ఆక్టోబర్ 1981న న్యూయార్క్ నగరంలోని మన్ హట్టన్ లో జన్మించింది. ఈమె అమెరికా ప్రస్తుత అధ్యక్షుడైన డోనాల్డ్ ట్రంప్ మరియు ఇవానా అనే దంపతులకు జన్మించింది. ఇవాంకా చాపిన్ స్కూల్ లో తన స్కూలింగ్ పూర్తి చేసింది మరియు వార్ టన్ స్కూల్ అఫ్ ది యూనివర్సిటీ అఫ్ పెన్నీసల్వాని లో తన గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. 



వ్యక్తిగత విషయాలు :


ఇవాంకా 2005లో రియల్ ఎస్టేట్ డెవలపర్ అయిన జారెడ్ కుశ్నేర్ ను ప్రేమించింది. అయితే ఇవాంకా ట్రంప్ ప్రెస్బిటేరియన్ క్రిస్టియన్ కుటుంబానికి చెందిన అమ్మాయి అవడంవల్ల కుశ్నేర్ కుటుంబం తనను కోడలిగా చేసుకోవడానికి ఇష్టపడరు. అప్పుడు ఇవాంకా ట్రంప్ తన ప్రేమను నిలబెట్టుకోవడం కోసం 2009లో జారెడ్ కుశ్నేర్ మతమైన జూవిష్ మతంలోకి మారిపోతుంది. అలా 25 అక్టోబర్ 2009లో వాళ్లిద్దరూ జూవిష్ సాంప్రదాయబద్ధంగా పెద్దల సమక్షంలో ఒకటవుతారు. వీళ్లకు ఇద్దరు అబ్బాయిలు పుట్టారు. 

మోడలింగ్ :


ఇవాంకా స్కూల్ లో చదువుకునేటప్పటి నుండే మోడలింగ్, ర్యాంప్ వాక్స్ చేయడం మొదలు పెట్టింది. తన తల్లితో కలిసి టామీ హిల్ఫైర్ లాంటి కంపెనీల మాగజైన్ లలో తన ఫోటోలతో  అందరికి కనిపించేది. అంతేకాకుండా తన బ్రాండ్ అయిన ఇవాంకా ఫ్యాషన్ ఐటమ్స్ కు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించేది.
  

వ్యాపారం :


తన గ్రాడ్యుయేషన్ చదువు పూర్తయిన తర్వాత ఫారెస్ట్ సిటీ ఎంటర్ ప్రైజస్ అనే కంపెనీలో ప్రాజెక్ట్ మేనేజర్ గా పని చేసింది.
 
ఆ తర్వాత ట్రంప్ ఆర్గనైజషన్ లోని డెవలప్మెంట్ & అక్విజిషన్స్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ గా పని చేసింది.
 
ఇవాంకా 2007లో డైనమిక్ డైమండ్ కార్పొరేషన్ అనే డైమండ్స్ తయారుచేసే కంపెనీతో కలిసి జూవెల్లరీ బిజినెస్ లో అడుగు పెడుతుంది. అలా తన జూవెల్లరీ ని అమెరికాలోనే కాకుండా కెనడా, బెహ్రెయిన్, కువైట్, ఖత్తర్, సౌదీ అరేబియా, దుబాయ్ లోని స్టోర్స్ లో కుడా అమ్మేవారు. 

ఇవాంకా ట్రంప్ ఫ్యాషన్ ఐటమ్స్ పేరుతో క్లాత్, హ్యాండ్ బ్యాగ్స్, షూస్ వంటి వస్తువులను  అమ్మడం మొదలు పెడుతుంది. అయితే ఈ బిజినెస్ మొదలుపెట్టినప్పటి నుండి ఇవాంకాకు వేరే బ్రాండ్స్ ని కాపీ కొడుతున్నారని జంతువుల చర్మంతో వస్తువులు తయారు చేస్తున్నారు అని ఎన్నో విమర్శలు ఎదురవుతాయి. అలా ఈ బిజినెస్ తక్కువ రోజులలోనే మూత పడుతుంది. 

రాజకీయం :


ఇవాంకా 2016లో తన తండ్రి అమెరికా అధ్యక్ష అభ్యర్థిత్వానికి మద్ధతుగా దేశంలోని పలు చోట్ల ప్రచారం చేస్తుంది. అలా 2016 అమెరికా ఎలెక్షన్స్ లో తన తండ్రి గెలుపుకు ప్రధాన పాత్ర పోషించింది. అమెరికా అధ్యక్షుడిగా డోనాల్డ్ ట్రంప్ ఎన్నిక  అయినప్పటి నుండి తను చేసే ప్రతి కార్యక్రమంలోను పాల్గొనేది. డోనాల్డ్ ట్రంప్ అప్పుడప్పుడు చేసే తప్పులను సరిచేసుకుంటూ తన తండ్రి వెన్నంటే ఉండేది. అలా 29 మార్చి 2017న డోనాల్డ్ ట్రంప్ అంతర్గత సలహాదారుగా నియమించబడింది. అంతేకాకుండా ఇవాంకా ఈ పదవిని చేపట్టడం ద్వారా ఫెడరల్ ఉద్యోగిగా మారుతుంది. ఇవాంకాను ప్రధాన సలహాదారుగా నియమించడం పై విమర్శలు రావడంతో తను ఒక్క డాలర్ జీతం కూడా తీసుకోకుండా పని చేస్తాను అని  ఒప్పుకుంటుంది. 

ఇవాంక ట్రంప్ యొక్క ప్రస్తుత నికర ఆదాయం 300 మిలియన్ డాలర్లు గా ఉంది. 

దానాలు :


ఇవాంకా ఛాయ్ లైఫ్ లైన్ అనే చిన్నపిల్లలకు కాన్సర్ ట్రీట్మెంట్ చేయించే సంస్థకు ప్రతి సంవత్సరం విరాళాలు ఇస్తుంది. 

ట్రంప్ ఫౌండేషన్ ద్వారా ఇంకా ఎన్నో విరాళాలు ఇస్తుంది. 

19, అక్టోబర్ 2020, సోమవారం

మీ హృదయాన్ని మరియు అంతర్ దృష్టిని అనుసరించే ధైర్యం కలిగి ఉండండి.

స్టీవ్ జాబ్స్


ఈ ప్రపంచంలో పుట్టిన ప్రతి వ్యక్తి తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకోవడం కోసం ప్రయత్నిస్తుంటాడు. రోజు రోజుకు అభివృద్ధి చెందుతున్న ఈ ప్రపంచంలో కొత్త కొత్త ఆవిష్కరణలు ఎప్పటికప్పుడు జరుగుతూ ఉంటాయి. అలా అభివృద్ధి చెందుతున్న ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ తమ బ్రాండ్ ని ఉత్పత్తులని ప్రపంచంలో అగ్రగామిగా నిలపాలని ఎంతగానో శ్రమపడతారు, కష్టపడతారు. ఆ క్రమంలో కొంత మంది అడ్డ దారులు తొక్కుతారు. మరి కొంత మంది రాత్రి పగలు అని తేడా లేకుండా అలుపెరగని ప్రయత్నం చేస్తూ ఎన్నో వ్యయప్రయాసలు పడుతూ, తమకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకోవడం కోసం  సంవత్సరాల తరబడి అలుపెరగని పోరాటాన్ని చేస్తారు. అలా తాము కన్న కలలను, నిర్దేశించుకున్న లక్ష్యాలను చేరుకుంటారు. అటువంటి వారిలో ప్రప్రధమంగా చెప్పుకోవలిసిన వ్యక్తి, అందరిలోను ఏదైనా చెయ్యాలి, సాధించాలి అనే సంకల్పబలం ఉండాలని కోరుకునే వ్యక్తి, ప్రపంచంలో అతి పెద్ద టెక్ కంపెనీ అయిన ఆపిల్ సామ్రాజ్యానికి బలమైన పునాదులు వేసిన వ్యక్తి, సహవ్యవస్థాపకుడు, మాజీ సీఈఓ అఫ్ ఆపిల్, వ్యాపార దిగ్గజం, పారిశ్రామిక డిజైనర్, మీడియా యజమాని స్టీవ్ జాబ్స్. 



బాల్యం మరియు విధ్యాబ్యాసం :


స్టీవ్ జాబ్స్ అసలు పేరు స్టీవ్ పాల్ జాబ్స్. స్టీవ్ జాబ్స్ 1955లో కాలిఫోర్నియా స్టేట్ లోని సాన్ ఫ్రాన్సిస్కో అనే కౌంటీలో జన్మించాడు. పాల్ జాబ్స్ మరియు క్లారా, స్టీవ్ జాబ్స్ యొక్క తల్లిదండ్రులు. వీళ్ళు  1955 ఫిబ్రవరి 24న అతనిని దత్తత తీసుకున్నారు. స్టీవ్ జాబ్స్ పుట్టింది పెరిగింది అంత సాన్ ఫ్రాన్సిస్కో. జాబ్స్ మొంటా లోమా ఎలిమెంట్రీ స్కూల్, క్రిట్టేడెన్  మిడిల్ స్కూల్, హోంస్టెడ్ హై స్కూల్స్ లో తన విధ్యాబ్యాసం పూర్తి చేసాడు. రీడ్ కాలేజీలో చదువు మొదలు పెట్టిన జాబ్స్ వాళ్ళ తల్లిదండ్రుల యొక్క ఆర్ధిక పరిస్థితి సరిగ్గా లేక తన చదువును మధ్యలోనే వదిలిపెట్టేస్తాడు.

 

వ్యక్తిగత విషయాలు :


స్టీవ్ జాబ్స్ తన భార్య అయిన లారెన్ పోవెల్ ను స్టాన్ఫోర్డ్ గ్రాడ్యుయేట్ స్కూల్ అఫ్ బిజినెస్ కాలేజీలో ఉపన్యాసం ఇస్తుండగా చూస్తాడు. ఆమెను చూస్తూ అలానే ఉండి పోతాడు. ఆ తర్వాత వాళ్ళిద్దరి మధ్య ఏర్పడిన పరిచయం కొన్ని రోజులకు ప్రేమగా మారుతుంది. అలా వాళ్లిద్దరూ మార్చి 18, 1991న పెద్దల సమక్షంలో ఒకటి అవుతారు. వీళ్లకు రీడ్, ఎరిన్, ఇవ్ అనే ముగ్గురు పిల్లలు ఉన్నారు. 

ఆపిల్ :

స్టీవ్ జాబ్స్ మరియు అతని స్నేహితుడు స్టీవ్ ఓజనిక్, అటారీ అనే వీడియో గేమ్స్ తయారు చేసే కంపెనీలో పనిచేస్తారు. అలా కలిసిన కొన్ని రోజులలోనే వాళ్లిద్దరూ మంచి స్నేహితులుగా మారతారు. ఆ క్రమంలో రోనాల్డ్ వేనర్ ఫౌండర్ గా స్టీవ్ జాబ్స్, స్టీవ్ ఓజనిక్ కో ఫౌండర్స్ గా ఆపిల్ కంపెనీని స్థాపిస్తారు. మొదట్లో వీళ్లిద్దరు కలిసి ఆపిల్ 1 ని కనిపెడతారు. కాని దాన్ని అభివృద్ధి చేయడానికి డబ్బులు లేక ఓజనిక్ తను తయారు చేసిన హెచ్ పి సైంటిఫిక్ కాల్కులేటర్స్ ని అమ్మేస్తాడు, జాబ్స్ తన వోక్స్ వేగన్ వాన్ ని అమ్మేస్తాడు. అలా వాళ్ళు తయారు చేసిన ఆపిల్ 1 మొదట్లో 500 డాలర్ల చొప్పున అమ్ముడవుతాయి. ఆపిల్ కంపెనీని మొదలు పెట్టిన నాలుగు సంవత్సరాలలోనే  72 బిలియన్ల మార్కెట్ ను సొంతం చేసుకుంటుంది. 1980లో ఐ.పి.ఓగా స్టాక్ మార్కెట్లో అడుగుపెట్టిన కొన్ని రోజులకే 300 కు పైగా ఇన్వెస్టర్స్ ని మిలియనీర్లు గా మార్చేసింది ఈ ఆపిల్. అలా ఆపిల్ కంపెనీలో తనకంటూ ఎంతో గొప్ప స్థానాన్ని సంపాదించుకున్న జాబ్స్ కొన్ని అనివార్య కారణాల వల్ల కంపెనీకి రిజైన్ చేసి బయటకి వెళ్లి పోతాడు.
  
అలా ఆపిల్ నుండి బయటకు వచ్చిన జాబ్స్ నెక్స్ట్  కంప్యూటర్స్ అనే సంస్థని స్థాపిస్తాడు. అతి తక్కువ సమయంలో ఆ కంపెనీ యొక్క వార్షిక ఆదాయం 1. 05 మిలియన్ డాలర్లకు చేరుస్తాడు. 1997లో ఆపిల్ కంపెనీ నెక్స్ట్ కంప్యూటర్స్ ని కొనుగోలు చేయడమే కాకుండా జాబ్స్ ని  ఆపిల్ కంపెనీ స్టాక్ హోల్డర్ గా చేసుకుంటుంది. అలా తిరిగి ఆపిల్ కంపెనీ కి వెళ్లిన జాబ్స్, ఆపిల్ సీఈఓ బాధ్యతలను చేపడతాడు. జాబ్స్ రూపొందించిన నెక్స్ట్ కంప్యూటర్స్ సాఫ్ట్ వేర్ లోని వెబ్ లోగ్స్ ని  ఉపయోగించి ఆపిల్  తమ అప్ స్టోర్, ఐట్యూన్స్ స్టోర్, మొబైల్ మీ సర్వీసెస్ నడిచే విధంగా చేసింది.  

స్టీవ్ జాబ్స్ ఫిక్సర్ అనే యానిమేటెడ్ డిజైన్ కంపెనీలో 10 మిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టడం ద్వారా ఆ కంపెనీలో అతి పెద్ద షేర్ హోల్డర్ గా మారతాడు. ఫిక్సర్ కంపెనీ వాల్ట్ డిస్నీ తో కలిసి యానిమేటెడ్ మూవీస్ ని తీసేది. అలా ఈ రెండు కంపెనీలు కలిపి తీసిన యానిమేటెడ్ సినిమాలు ఎంతో గొప్ప విజయాలను సాధిస్తాయి. ఈ క్రమంలో  ఫిక్సర్ కంపెనీ అతి తక్కువ సమయంలోనే ఎంతో గొప్ప పేరు సంపాదించుకుంటుంది. అంతే కాకుండా జాబ్స్ వాల్ట్ డిస్నీ లో 7 శాతం వాటా పొందడం ద్వారా ఆ కంపెనీ యొక్క అతి పెద్ద షేర్ హోల్డర్ గా మారతాడు. 

ఆపిల్ యొక్క ఉత్పాదనలు అయిన ఆపిల్1, ఆపిల్2, ఆపిల్ లిసా, మాకిన్ టోస్, ఐమాక్, ఐట్యూన్స్, ఐపాడ్, ఐపోడ్, ఐఫోన్ ల ఆవిష్కరణలలో జాబ్స్ ప్రముఖ పాత్ర పోషించాడు. 

ఆపిల్ ప్రపంచంలోనే మొట్టమొదటి 1 ట్రిలియన్ టెక్ కంపెనీగా చరిత్ర సృష్టించింది.  

మరణం :


ఇలా ఎన్నో గొప్ప విజయాలు సాధించిన స్టీవ్ జాబ్స్ 5 అక్టోబర్ 2011లో న్యూరో ఎండో క్రైన్ క్యాన్సర్ అనే జబ్బుతో మరణించాడు. 

16, అక్టోబర్ 2020, శుక్రవారం

సి.బి.డి ఆయిల్ అంటే ఏమిటి ? సి.బి.డి ఆయిల్ ను వాడితే జైలు శిక్ష తప్పదా!

సి.బి.డి. ఆయిల్(కెనబిడియల్ ఆయిల్)


ఇండియాలో ఇప్పుడు చర్చనీయాంశంగా నిలిచిన విషయం సుశాంత్ సింగ్ రాజపుత్ ఆత్మహత్య. అయితే ఈ కేసును దర్యాప్తు చేస్తున్న క్రమంలో ఎన్నో కొత్త కొత్త విషయాలు, కొత్త కొత్త మనుషులు వెలుగులోకి వస్తున్నారు. అలా వెలుగులోకి వచ్చిన ఒక విషయం సి.బి.డి.ఆయిల్. విషయానికి వస్తే సుశాంత్ సింగ్ హత్య కేసులో ప్రధాన నిందితురాలైన రియా చక్రబోర్తి ను విచారించే క్రమంలో తన మొబైల్ ఫోన్లోని ఆధారాలను వెతుకుతున్నారు. ఆ సమయంలో రియా చక్రబోర్తి వాట్సాప్ ను పరిశీలిస్తూ ఉండగా రియా మరియు సుశాంత్ సింగ్ మాజీ మేనేజర్ జయ సాహ ఆడియో రికార్డింగ్స్ వెలుగులోకి వచ్చాయి . వీరిద్దరి సంభాషణల ఆధారంగా సి.బి.డి. ఆయిల్ వెలుగులోకి వచ్చింది.   



సి.బి.డి. ఆయిల్ పూర్తి పేరు కెనబిడియల్ ఆయిల్. ఈ కెనబిడియల్ ఆయిల్ అనేది కెనబిడియల్ చెట్టు నుండి వెలువడిన రసాయనం. దీనిని మారిజుఆన మరియు కన్నాబిస్ సతివా అని కూడా అంటారు. తెలుగులో ఈ కెనబిడియల్ చెట్టును గంజాయి మొక్క అని అంటారు. ఈ కెనబిడియల్ మనకు ఆయిల్ మరియు పౌడర్ రూపంలో లభిస్తుంది. ఈ చెట్టు 100కు పైగా రసాయన పదార్థాలను వెలువడిస్తుంది. అంతే కాకుండా ఈ కెనబిడియల్ లో ఎక్కువ శాతం టెట్రా హైడ్రో కన్నబినోల్ అనే పదార్థం ఉంటుంది, ఇది మనకు అధికమైన ఆనంద అనుభూతిని కలిగిస్తుంది. ఈ గంజాయి మొక్క ద్వారా వెలువడిన రసాయనాన్ని సేవించడం ద్వారా తాత్కాలిక ఉపశమనం, మానసిక ప్రశాంతత కలగడం, బాధ మరియు ఆవేదన దూరమవుతాయి. ఈ ఆయిల్ ను సేవించే వారిలో భారతదేశం ముందు స్థానంలో ఉంది.

ఈ కెనబిడియల్ ను సేవించిన వెంటనే ఇది మన మెదడుపై ప్రభావం చూపిస్తుంది. అలా మన మెదడులోని నరాలను నియంత్రిస్తూ మనలోని బాధను, అశాంతిని మనకు దూరం చేస్తుంది. సి.బి.డి ఆయిల్ ను సేవించడం అనేది భారతదేశంలో చట్టరీత్యా నేరం కాదు. కాని దీనిని ఎక్కువగా సేవించడం వల్ల తీవ్రమైన ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. 2019 లో మినిస్ట్రీ అఫ్ సోషల్ జస్టిస్ చేసిన పరిశోధనలో భారతదేశం మొత్తం మీద 2.8 శాతం మంది ఈ కెనబిడియల్ ను వాడుతున్నారని తేలింది. అంటే దగ్గర దగ్గర 3 కోట్ల మంది దీనిని సేవిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా దీనిని ఎక్కువగా సేవించే వారిలో ముంబై, ఢిల్లీ ప్రజలే ముందు వరసలో ఉన్నారు. 

ఈ  కెనబిడియల్ ఆయిల్ మరియు పౌడర్ భారతదేశంలోని అన్ని ఆన్ లైన్ వెబ్ సైట్స్ లో మనకు లభిస్తున్నాయి. అయితే ఈ కెనబిడియల్ ఆయిల్ ను ఎలా ఉపయోగించాలి,ఎంత మోతాదులో ఉపయోగించాలి అనేది మాత్రం మనం ఆర్డర్ చేసిన వస్తువుపై ఉండదు. అయితే దీనిని ఎంత వరకు వాడాలి, ఎంత మోతాదులో తీసుకుంటే మన శరీరానికి హాని కలగదు అనే విషయాలను డాక్టర్ ను సంప్రదించి తెలుసుకున్న తర్వాతే దీనిని వాడాలి. ఇప్పటికే ఎంతో మంది బాలీవుడ్ తారలు దీనిని సేవించడం పై వివరణ ఇవ్వడం కోసం నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (NCB) ముందు హాజరయ్యారు. కాబట్టి దీనిని వైద్యుల సూచన మేరకు వాడండి ఆరోగ్యంగా ఉండండి. 

13, అక్టోబర్ 2020, మంగళవారం

వూహన్ ప్రభుత్వ ప్రయోగ శాలలో నోవల్ కరోనా వైరస్ అభివృద్ధి చెందిందని చైనా వైరాలజిస్ట్ అంటున్నారు.

చైనాలో పుట్టిన నోవల్ కరోనా వైరస్


ప్రపంచాన్ని చిన్నాభిన్నం చేసేసింది, ఎంతోమంది ఆకలి చావులకు కారణమయ్యింది, ఎన్నో దేశాల ఆర్ధిక వ్యవస్థలకు తీరని నష్టాలను కలిగించింది, మరెంతో మందిని ప్రాణాలు కోల్పోయేలా చేసింది, అతి తక్కువ రోజులలో ఇదంతా చేసింది, ఇలా ఇదంతా చేసింది, ఈనాటీ  పరిస్థితులకు కారణం అయ్యింది ఒకే ఒక్క వైరస్, ప్రపంచమంతటా వ్యాపించి ప్రజలను వణికిస్తున్న కరోనా వైరస్. 

విషయానికి వస్తే ఈ కరోనా వైరస్ చైనాలోని లైవ్ సీ ఫుడ్స్ మార్కెట్ నుండి పుట్టిందని అక్కడి నుండి చైనాకు మరియు ఇతర దేశాలకు వ్యాపించిందని చైనా కమ్యూనిస్ట్ ప్రభుత్వం మొదటి నుండి చెప్పుకొస్తోంది. అయితే ఈ కరోనా వైరస్ చైనాలోని లైవ్ సీ ఫుడ్స్ మార్కెట్లో పుట్టలేదని వూహన్ వైరాలజీ ల్యాబ్ లో పుట్టిందని చైనా వైరాలజిస్ట్ చెబుతున్నారు. 



డాక్టర్, వైరాలజిస్ట్ అయిన  లీ మాంగ్ యాన్ అనే మహిళ కరోనా వైరస్ చైనాలో పుట్టిందని మీడియాకు వివరించింది. అయితే ఈమె హాంగ్ కాంగ్ స్కూల్ అఫ్ పబ్లిక్ హెల్త్ యూనివర్సిటీలో ప్రపంచ ప్రమాద వ్యాధుల నిపుణురాలిగా పని చేసేవారు. అక్కడినుండి చైనాలోని వూహన్ లో కొత్తగా వచ్చిన  లుకేమియా వ్యాధి పై రహస్య పరిశోధనలు చేయడానికి వెళ్లిన వాళ్లలో ఈమె ఒకరు. ఈమె డిసెంబర్, 2019 మరియు జనవరి, 2020 లో చేసిన పరిశోధనల ఫలితాలను వరల్డ్ హెల్త్ ఆర్గనైజషన్ సూపర్ వైజర్ కి వెల్లడిస్తుంది. అయితే అతను పట్టించుకోడు, మరియు ఆమెకు ఈ వైరస్ గురించి పట్టించుకోవద్దని ఒక వేళ దీని గురించి ఎవరితోనైనా చెబితే నువ్వు బ్రతికి ఉండవు అని ఆమెకు చెబుతాడు. అయితే ఈ రోగం ముందు ముందు రోజుల్లో ప్రమాదకారిగా మారొచ్చని దీని గురించి ప్రజలకు తెలియజేయాలని ప్రయత్నిస్తుంది. ఆ క్రమంలో చైనాలోని లూథర్ అనే వ్యక్తిని కలుస్తుంది. ఆయనతో తన పరిశోధనల ద్వారా కనిపెట్టిన 5 ఫలితాలను అతనికి తెలియజేస్తుంది.

1) కోవిడ్ -19 వైరస్ ని చైనా ప్రభుత్వం కనిపెట్టింది. 
2) ఇది ఒక మనిషి నుండి ఇంకో మనిషికి అంటుకునే వ్యాధి. 
3) ఇది ముందు ముందు రోజుల్లో అత్యంత ప్రమాదకారిగా మారుతుంది. 
4) ఈ వైరస్ చైనా లైవ్ సీ ఫుడ్స్ మార్కెట్ నుండి రావడం నిజం కాదు. 
5) ఇది ప్రకృతి నుండి వచ్చిన వైరస్ కాదు చైనాలోని వుహాన్ ల్యాబ్ లో సి.సి.45,జె.ఎక్స్.ఈ.21 అనే చెడ్డ కరోనా కణాలతో తయారు చేయబడిన వైరస్, ఈ వైరస్ లో చిన్న చిన్న మార్పులు చేసి చివరకు నోవల్ కరోనా వైరస్ గా రూపుదిద్దారు. 

అయితే ఈ వైరస్ చైనాలోని ల్యాబ్ లో పుట్టిందనడానికి చైనా శాస్త్రవేత్తల అధ్యయనం, హంగ్ కాంగ్ నిపుణుల అధ్యయనం మనకు ఆధారాలుగా నిలుస్తాయి అని ఆమె చెబుతుంది. అయితే ఈ వైరస్ చైనాలోని లైవ్ సీ ఫుడ్స్ మార్కెట్లోని సీ ఫుడ్స్ కణాల నుండి రాలేదని ఈ వైరస్ మనిషి యొక్క కణాల నుండి పుట్టిందని, యూ.ఎస్ లోని శాస్త్రవేత్తలు దీనిపై అధ్యయనం చేస్తున్నారని మరికొన్ని రోజుల్లో తమ పరిశోధనల ఫలితాలను ఒక బుక్ లో ప్రచురించి ప్రపంచానికి కరోనా వైరస్ యొక్క నిజాన్ని  తెలిసేలా చేస్తామని ఆమె తెలియచేసారు. అంతే కాకుండా ఈ బుక్ ను చూస్తే ఎటువంటి బయాలజీ నాలెడ్జి లేకపోయినా సరే ఈ వైరస్ మనిషి కణాలతో తయారుచేశారని సులువుగా తెలుస్తుందని ఆమె తెలియ చేసారు. 

10, అక్టోబర్ 2020, శనివారం

12 సంవత్సరాల క్రితం మరణించిన బాలిక ఈ రోజు గృహిణిగా సజీవంగా ఉంది.

నమ్మ లేని నిజం


12 సంవత్సరాల క్రితం చనిపోయింది అన్న అమ్మాయి ఈ రోజు బ్రతికే ఉంది. అయితే ఆ అమ్మాయి హత్య కేసులో ప్రధాన నిందితులుగా గుర్తించబడ్డ  6 మంది వ్యక్తులకు జైలు శిక్ష కూడా పడింది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కాన్పూర్ లో చోటు చేసుకున్న ఈ సంఘటన అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. 


2008వ సంవత్సరంలో తన కూతురు కనిపించడం లేదని ఆమె తల్లి కొత్వాలి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసింది. పోలీసులు కేసును దర్యాప్తు చేస్తుండగా కాన్పూర్ జిల్లాలోని ఘతంపూర్ ప్రాంతంలో గుర్తుతెలియని మహిళ శవం లభ్యమవగా, ఆ శవాన్ని చుసిన బాధితురాలి తల్లి తన కూతురని నిర్దారిస్తుంది. ఈ కేసులో ప్రధాన నిందితులుగా 6 మంది యువకులను కస్టడీలోకి తీసుకుంటారు. కేసు వివరాలను తెలుసుకునే క్రమంలో ఒక నిందితుడు మరణించగా మిగిలిన ఐదుగురు బెయిల్ మీద విడుదలయ్యారు. 

అయితే ఈ కేసులో చనిపోయిందని నిర్దారించబడిన మహిళ బ్రతికి ఉందని చెప్పిన స్థానిక రాజకీయ నాయకుడి ఫిర్యాదు మేరకు పోలీసులు ఆమెను కలుస్తారు. అయితే ఆమె 26 ఏళ్ళ వయసు ఉన్న ఒక ఇంటి గృహిణిగా కనిపిస్తుంది. వెంటనే ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకుంటారు. అయితే అసలు ఏమి జరిగింది ఆమె ఎలా బ్రతికి ఉంది అనే విషయాలు తెలియవలిసి ఉండగా కేసును పోలీసులు సీబీసీఐడీ కి అప్పగించారు. 

8, అక్టోబర్ 2020, గురువారం

ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ వచ్చేసింది. అయితే ఈ సేల్ మొదలవక ముందే 70,000 రూపాయల ఎల్. జీ. డ్యూయల్ స్క్రీన్ మొబైల్ తరహా పరికరాన్ని 19,990 రూపాయలకు ప్రకటించి అందరికి పిచ్చెక్కిస్తోంది.

   

ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్


భారతదేశంలోని అతిపెద్ద ఈ కామర్స్ వెబ్ సైట్స్ లో ఒకటైన ఫ్లిప్ కార్ట్ ఇప్పుడు బిగ్ బిలియన్ డేస్ సేల్ తో మన ముందుకు వచ్చింది. ఈ ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ అక్టోబర్ 16 నుండి 21 వరకు ఉంటుంది. అయితే ఫ్లిప్ కార్ట్ ఇప్పటికే కొన్ని అద్భుతమైన ఆఫర్స్ ప్రకటించి అందరిని ఆకర్షిస్తోంది. ఇలా ఫ్లిప్ కార్ట్ ప్రకటించిన ఈ ఆఫర్లలో మొదటగా మనం మాట్లాడుకోవాల్సిన ఆఫర్ ఎల్.జీ. జీ8ఎక్స్ థింక్ డ్యూయల్ స్క్రీన్ మొబైల్ తరహా పరికరం.  


ఈ ఎల్.జీ. జీ 8 థింక్ ఎక్స్ డ్యూయల్ స్క్రీన్ మొబైల్ తరహా పరికరం యొక్క అసలు ఖరీదు 70,000 రూపాయలు, అయితే ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ లో ఈ పరికరం 19,990 రూపాయలకు లభ్యమవుతుంది. ప్రస్తుతం మాత్రం ఈ పరికరం 15,000 డిస్కౌంట్ ఆఫర్ తో మనకు 55,000 రూపాయలకు లభిస్తుంది. ఈ సేల్ ఈ నెల 16 నుండి మొదలవుతుంది కాబట్టి ఈ సేల్ కూడా అప్పటి నుండి మొదలుపెట్టొచ్చు. అంతే కాకుండా డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు, బ్యాంకు ఆఫర్స్ కూడా మనకు ఈ సేల్ లో లభిస్తాయి. 


ఎల్.జీ. జీ8ఎక్స్ థింక్ డ్యూయల్ స్క్రీన్ మొబైల్ తరహా పరికరం యొక్క విశేషాలు :


ఎల్.జీ. జీ8ఎక్స్ థింక్ యొక్క డిస్ప్లే  6.4 ఇంచ్ ఫుల్ హెచ్.డీ + ఓ.ఎల్.ఇ.డీ. డిస్ప్లే మరియు రెసొల్యూషన్ 2340*1080 ఫిక్సల్స్. 

6 GB RAM మరియు 128 GB RAM అంతేకాకుండా ఈ 128 GB RAM, 2 TB వరకు విస్తరించుకోవచ్చు.

ఈ పరికరం క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 855 ప్రాసెసర్ తో నిర్మితమైంది. 

ఈ పరికరం గూగుల్ ఆండ్రాయిడ్ 10 ఆపరేటింగ్ సిస్టముతో నడుస్తుంది. 
దీని బ్యాటరీ కెపాసిటీ 4000 MAH.  

ఈ పరికరం యొక్క సెల్ఫీ కెమెరా 12 మెగా ఫిక్సల్స్, ముందు కెమెరా 32 మెగా ఫిక్సల్స్ గా ఉంది. 

అంతే కాకుండా దీనికి 13 మెగా ఫిక్సల్స్ సూపర్ వైడ్ ఏంజెల్ సెన్సార్ కూడా ఉంది. 

ఈ ఫోన్ రెండు 1.2W స్పీకర్లతో వస్తుంది మరియు మెరిడియన్ ఆడియో ట్యూన్ చేసిన 32-బిట్ హై-ఫై క్వాడ్ డిఎసిని కలిగి ఉంది. ఇది MIL-STD 810G రేటింగ్‌తో IP68 వాటర్ రెసిస్టెన్స్ రేటింగ్‌ను కలిగి ఉంది. 

7, అక్టోబర్ 2020, బుధవారం

ఆపిల్ సంస్థ తమ మొట్టమొదటి ఆన్ లైన్ ఈ కామర్స్ స్టోర్ ని ఇండియాలో ప్రారంభిస్తోంది.

ఆపిల్ ఇండియన్ ఆన్ లైన్ స్టోర్


ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొంది ఎన్నో దేశాలలో తమ వస్తువులను అమ్ముతూ తమ సంస్థకు ఒక ప్రముఖ స్థానాన్ని దక్కించుకున్న కంపెనీ ఆపిల్. అమెరికాలో మొదలైన చిన్న కంపెనీ ఈ రోజు ప్రపంచం మెచ్చుకోదగ్గ టెక్ కంపెనీ లలో మొదటి స్థానంలో నిలిచింది. అయితే ఇప్పటి వరకు ఆపిల్ తమ వస్తువులను ఇండియా లోని రిటైల్ స్టోర్స్ లోను,అమెజాన్,ఫ్లిప్ కార్ట్ లాంటి ఈ కామర్స్ వెబ్ సైట్స్ లో మాత్రమే విక్రయించేది. అయితే ఇప్పుడు ఆపిల్ భారతదేశంలో తమ వస్తువులను నేరుగా తమ వెబ్ సైట్స్ లో అమ్మడానికి సిద్ధమైంది. అందుకోసం ఆపిల్ తన ఆన్ లైన్ ఈ కామర్స్ వెబ్ సైట్ ని భారతదేశంలో ప్రారంభించింది. ఇలా ఆన్ లైన్ లో తమ వస్తువులను అమ్మడం ద్వారా  మరింత డిమాండ్ ను మరియు ఆదాయాన్ని పెంచుకోవడానికి ఆపిల్ ప్రయత్నిస్తోంది. 


ఈ ఆపిల్ ఆన్ లైన్ స్టోర్స్ లో అన్ని రకాలైన ఆపిల్ ఉత్పత్తులు ఐఫోన్,మ్యాక్,ఐపోడ్ టచ్,ఐపాడ్,వాచ్,టీవీ,ఎయిర్ పోడ్స్,మ్యూజిక్,హోమ్ పోడ్,యాక్సెసరీస్ అమ్ముతున్నారు. అంతే కాకుండా ఆపిల్ సర్వీసెస్ అయిన ఆపిల్ మ్యూజిక్,ఆపిల్ టీవీ ప్లస్,ఆపిల్ ఆర్కేడ్,ఐ క్లౌడ్,ఆపిల్ వన్,ఆపిల్ బుక్స్ ను అందుబాటులోకి తెచ్చారు.అంతే కాకుండా మనకు నచ్చిన ఐఫోన్ యొక్క కాన్ఫిగరేషన్,స్టోరేజ్ కెపాసిటీ,ర్యామ్ వంటి విషయాలను పూర్తిగా చుసిన తర్వాత మనం ఐఫోన్ ను ఆర్డర్ చేయవచ్చు.  

ఈ ఆన్ లైన్ స్టోర్ 23,సెప్టెంబర్,2020 నుండి భారతదేశంలో అందుబాటులోకి వస్తుంది. 

ఆపిల్ ట్రేడ్ ఇన్ సర్వీసెస్ :


ఈ ఆపిల్ ట్రేడ్ ఇన్ సర్వీసెస్ ద్వారా మన పాత ఆపిల్ మొబైల్ ఫోన్ ని ఇవ్వడం ద్వారా కొత్త ఆపిల్ మొబైల్ ఫోన్ ని తీసుకునే సదుపాయాన్ని ఆపిల్ సంస్థ మనకు కల్పిస్తుంది. ఇందుకోసం మనం ఆపిల్ ఆన్ స్టోర్ లో మన పాత ఐఫోన్ యొక్క సమాచారాన్ని తెలియచేయవలసి ఉంటుంది. అలా ఆపిల్ అడిగిన పూర్తి ప్రశ్నలకు సమాధానాలు తెలిపిన తర్వాత మనం ఆర్డర్ చేసే కొత్త మొబైల్ ఫోన్ ప్రైస్ మనకు తెలుస్తుంది.క్రెడిట్ కార్డ్స్ పై నెలవారీ డబ్బు చెల్లింపుల సదుపాయం కూడా ఆపిల్ మనకు కల్పిస్తుంది. 

ఆపిల్ కేర్ ప్లస్ (+):


మీరు ఆపిల్ ఐఫోన్లను కొనుక్కుంటే మీకు కంపెనీ ద్వారా వారెంటీ అనేది వస్తుంది. అయితే ఈ కంపెనీ వారెంటీ ఒక సంవత్సరం మాత్రమే ఉంటుంది. అయితే  ఆపిల్ మన ముందుకు తీసుకు వచ్చిన ఆపిల్ కేర్ ప్లస్ ద్వారా మన మొబైల్ తో పాటు వచ్చిన 1 సంవత్సరం వారెంటీతో పాటు మరో రెండు సంవత్సరాలు వారెంటీ మనకు లభిస్తుంది. అయితే ఈ వారెంటీలో కొన్ని షరతులు ఉన్నాయి. అవేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. 

మొదటగా ఈ ఆపిల్ కేర్ ప్లస్ సదుపాయాన్ని పొందాలంటే మీరు ఆపిల్ ప్రోడక్ట్  కొని 60 రోజులు మించకూడదు. ఆపిల్ ప్రోడక్ట్ కొన్న 60 రోజులలోపు మాత్రమే మీరు ఈ సదుపాయాన్ని  పొందగలరు. ఇంకా ఈ సదుపాయాన్ని పొందడానికి మీరు మీ కొత్త ఆపిల్ మొబైల్ ఫోన్ నుండే రిజిస్టర్ అవ్వొచ్చు. లేదంటే 0008001009009 కు డయల్ చేయడం ద్వారా కూడా మీరు ఈ సదుపాయాన్ని పొందగలరు. అయితే నెంబర్ డయల్ చేయడం ద్వారా ఈ  సదుపాయాన్ని పొందడం కోసం మీరు మొబైల్ కొన్న పేమెంట్ స్లిప్ ను సమర్పించవలసి ఉంటుంది. 

ఈ ఆపిల్ కేర్ ప్లస్ సదుపాయాన్ని ఆక్టివేట్ చేసుకోవడం ద్వారా సాఫ్ట్ వేర్ సమస్యలైనా ఐఫోన్,ఐ.ఓ.ఎస్,ఆపిల్ బ్రాండెడ్ యాప్స్ లో ఏమైనా సమస్యలు తలెత్తితే ఆపిల్ ప్రతినిధులు ఇచ్చే సలహాలు సూచనలతో మన ఆపిల్ డివైస్ సమస్యలను పరిష్కరించుకోవచ్చు.
  
అంతేకాకుండా మన ఆపిల్ డివైస్ లో ఏమైనా హార్డ్ వేర్ సమస్యలు తలెత్తితే రిపేర్ మరియు ప్రోడక్ట్ మార్చుకునే అవకాశం ఉంటుంది. అయితే స్క్రీన్ డామేజ్ గాని మరేయితర డామేజ్ అయినా సంవత్సరంలో 2 సార్లు మాత్రమే చూస్తారు. అంటే మొత్తం రెండు సంవత్సరాల వారెంటీ లో 4 సార్లు డామేజ్ ప్రొటెక్షన్ కవర్ మనకు లభిస్తుంది. అయితే స్క్రీన్ డామేజ్ కి  సర్వీస్ ఛార్జ్ 2500 రూపాయలు తీసుకుంటారు. మరేయితర డామేజ్ అయిన గాని 8900 రూపాయలు సర్వీస్ ఛార్జ్ తీసుకుంటారు.  

4, అక్టోబర్ 2020, ఆదివారం

SAMSUNG GALAXY - M51 ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్ యొక్క విశ్లేషణ.


SAMSUNG  GALAXY - M51


ఎలక్ట్రానిక్ ఇండస్ట్రీ లోని దిగ్గజ కంపెనీలలో ఒకటైన శాంసంగ్ కంపెనీ తన కొత్త ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్ శాంసంగ్ గెలాక్సీ -ఎమ్ 51 ని మార్కెట్లోకి తీసుకొచ్చింది . మనం ఇప్పుడు ఈ మొబైల్ యొక్క పనితీరు మరియు ఈ మొబైల్ లోని విశిష్టతలను గూర్చి తెలుసుకుందాం. ఇప్పటి వరకు వచ్చిన శాంసంగ్ ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్స్ కంటే భిన్నముగా ఇది 7000MAH బ్యాటరీ తో మనముందుకు వస్తుంది. 


ఈ శాంసంగ్ మొబైల్ ఫోన్ యొక్క బ్యాటరీ కెపాసిటీ 7000 mAh. ఛార్జింగ్ ఫుల్ అవడానికి 2 గంటలు పడుతుంది అంతేకాకుండా 2 రోజులు పాటు నడుస్తుంది.
ఈ మొబైల్ యొక్క డిస్ప్లే 6.70 అంగుళాల స్క్రీన్ మరియు గొర్రిలా గ్లాస్,టచ్ స్క్రీన్ .
ఈ మొబైల్ మనకు రెండు కలర్స్ లో లభిస్తుంది. ఒకటి ఎలక్ట్రిక్ బ్లూ,రెండవది సెలెస్టియల్ బ్లాక్.
ఈ మొబైల్ 6gb ram,128gb స్టోరేజ్ మరియు 8gb ram,128gb స్టోరేజీలలో లభిస్తుంది. అంతే కాకుండా దీని యొక్క స్టోరేజీ ను 512gb వరకు విస్తరించుకోవచ్చు. 
కెమెరా విషయానికి వస్తే దీనియొక్క ప్రాధమిక కెమెరా 64 మెగా పిక్సల్, రెండవ కెమెరా 12 మెగా పిక్సల్ గా ఉంది. అంతే కాకుండా ఈ మొబైల్ లో మెక్రో సెన్సార్,డెప్త్ సెన్సార్ ఉన్నాయి. 
ఇది క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ soc తో నిర్మితమైన మొట్టమొదటి శాంసంగ్ మొబైల్ ఫోన్. 
ఈ మొబైల్ లో రెండు నానో సిమ్ స్లాట్స్  మరియు ఒక డెడికేటెడ్ మెమొరీ కార్డ్ స్లాట్ ఉన్నాయి. 
ఈ మొబైల్ బరువు 213 గ్రామ్స్ . 



ఈ మొబైల్ యొక్క స్క్రీన్ 6.7 అంగుళాలు,ఇది గేమింగ్ కు,వీడియోస్ చూడడానికి చాలా అనుకూలంగా ఉంటుంది. 
ఈ మొబైల్ లోని క్వాల్కమ్ ప్రాసెసర్ గేమింగ్ కు,యాప్స్ డౌన్లోడ్స్  కు,స్లో అవడం లాంటి ఇబ్బందులు కలగకుండా ఉండడానికి సహకరిస్తుంది. 
6gb,8gb ram సిస్టమ్స్ ఫోన్ ని హ్యాంగ్ కాకుండా చేస్తాయి. 
ఈ మొబైల్ బాడీ కూడా చాలా స్ట్రాంగ్ గా డిజైన్ చేయబడింది. 
ఈ మొబైల్ చూడడానికి చాలా స్లిమ్ గా ఎంతో ఆకర్షణీయంగా ఉంది. 

ఈ శాంసంగ్ గెలాక్సీ -ఎమ్ 51 మొబైల్ అమెజాన్ మరియు శాంసంగ్ స్టోర్స్ లో మనకు అందుబాటులోకి వచ్చాయి. 

సెప్టెంబర్ 22,2020 కు 6gb ram,128 internal storage  మొబైల్ ఫోన్ ఖరీదు 24,999 గా ఉంది. 
మరియు 8gb ram ,128gb internal storage మొబైల్ ఫోన్ ఖరీదు 26,999 గా ఉంది.  

1, అక్టోబర్ 2020, గురువారం

వాల్ మార్ట్ మరియు టాటా గ్రూప్ కంపెనీల కలయిక ద్వారా సూపర్ యాప్.

టాటా-వాల్ మార్ట్ భారీ ఒప్పందం.


భారతదేశంలోని దిగ్గజ కంపెనీలలో ఒకటైన టాటా సంస్థ, తన రిటైల్ వ్యాపారాలను ఆన్ లైన్ ప్లాట్ ఫార్మ్స్  పైకి తీసుకు రావడానికి  సిద్ధమైంది. అందుకోసం అవసరమైన వెబ్ సైట్ ని, యాప్ ను రూపొందిస్తోంది. ఆ యాప్ పేరు సూపర్ యాప్. ఈ యాప్ లో టాటా సంస్థ తయారుచేసిన అన్ని ఉత్పత్తులను నిక్షిప్తపరుస్తారు. తద్వారా వినియోగదారులు ఇంటి వద్ద నుండే సులువుగా టాటా వస్తువులను కొనుగోలు చేసుకోవచ్చు. అయితే ఫ్లిప్ కార్ట్ లో 66 శాతం వాటాను కలిగి ఉన్న వాల్ మార్ట్ సంస్థ, ఈ సూపర్ యాప్ లో 26 బిలియన్ డాలర్లను పెట్టుబడిగా పెట్టడానికి ముందుకొచ్చిందని, తద్వారా ఈ సూపర్ యాప్ లో అత్యధిక వాటాదారుగా నిలవబోతోందని సమాచారం.
 


భారతదేశంలో టాటా అనే పేరు తెలియనివారు పెద్దగా ఉండకపోవచ్చు. ఎందుకంటే ఆ సంస్థ తయారుచేయని ఉత్పాదన అంటూ లేదు కాబట్టి. మనం రోజు కూరల్లో వేసుకునే ఉప్పు నుండి ఎక్కువ డబ్బులు పెట్టి కొనుక్కునే బంగారం దాకా అన్ని రంగాలలోను తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సొంతం చేసుకుంది. అయితే టాటా సంస్థ ద్వారా వచ్చిన ఉత్పత్తులన్ని ఎక్కువగా రిటైల్ స్టోర్స్ లో అమ్మడం మనం చూస్తున్నాం, అయితే కరోనా లాక్ డౌన్ టైమ్ లో  ఎక్కువ మంది ఇంటిదగ్గర నుండే వస్తువులను కొనడం వల్ల ఈ సంస్థ రిటైల్ వ్యాపారంలో కొంచెం నష్టాలను చూడవలసి వచ్చింది. వాటన్నింటిని దృష్టిలో పెట్టుకుని టాటా సంస్థ సూపర్ యాప్ అనే యాప్ ద్వారా ఆన్ లైన్ వ్యాపారాన్ని మొదలు పెట్టింది. 

ఈ యాప్ ద్వారా టాటా సంస్థ, హెల్త్ కేర్, ఆహారం, కిరాణా సేవలు, భీమా, ఆర్ధిక సేవలు, ఫ్యాషన్, లైఫ్ స్టైల్, ఎలక్ట్రానిక్స్, ఎడ్యుకేషన్, బిల్ పేమెంట్స్  లాంటి అన్నిసేవలను ఒకే ఛానల్ పైకి తీసుకొస్తోంది. అయితే ఈ సూపర్ యాప్ డిసెంబర్ లేదా జనవరి లో ప్రారంభమవ్వొచ్చని టాటా సన్స్ ఛైర్మన్ ఎన్. చంద్రశేఖరన్ ఇప్పటికే  వెల్లడించారు. సుమారుగా 50 - 60 బిలియన్ డాలర్ల పెట్టుబడితో మొదలవుతున్న ఈ సూపర్ యాప్ లో అమెరికా సంస్థ వాల్ మార్ట్ 26 బిలియన్ డాలర్ల  పెట్టుబడి పెట్టనుంది. తద్వారా వాల్ మార్ట్, సూపర్ యాప్ వ్యాపారంలో అతిపెద్ద వాటాదారుగా నిలవనుంది. ఈ లావాదేవీ కోసం వాల్ మార్ట్  గోల్డ్ మాన్ సాచ్స్ ఇన్వెస్టర్ బ్యాంకు ను తమ ఇన్వెస్టర్ బ్యాంకు గా నియమించుకున్నట్టు సమాచారం.   

కోరిన కోర్కెలు తీర్చే కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి.

కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి పూర్వం ద్వారకుడు అనే వ్యక్తి ప్రతి యేటా భక్తి శ్రద్ధలతో ఆ తిరుమల వేంకటేశ్వర స్వామిని దర్శించుకునేవాడు. అయ...