attraction లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
attraction లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

27, డిసెంబర్ 2020, ఆదివారం

తనదైన శైలిలో ప్రపంచాన్ని ఆకట్టుకుంటున్న సినిమా తెలుగు సినిమా.

తెలుగు సినీ పరిశ్రమ (TFI)


ప్రపంచ పటంలో ఎక్కడో మారుమూల చిన్న పరిశ్రమ. కాని ఈ రోజు ప్రపంచం గర్వించదగ్గ సినిమాలను రూపొందిస్తోంది ఈ పరిశ్రమ. భారత దేశ సినిమా ఖ్యాతిని నలుదిశలకు ప్రసరింప చేస్తూ బలంగా నిలబడింది ఈ పరిశ్రమ. అంతేకాకుండా యువతరానికి నేనున్నాను అన్న భరోసాను కలిగిస్తుంది ఈ పరిశ్రమ. ఎంతో మంది యువ నటీనటులకు,నిర్మాతలకు,దర్శకులకు అవకాశం కల్పిస్తోంది ఈ సినీ పరిశ్రమ. అద్భుతమైన సినిమాలను తెరకెక్కిస్తూ అవి బాక్స్ ఆఫీస్ దగ్గర కోట్ల వర్షం కురిపించేలా చేస్తుంది ఈ పరిశ్రమ. ఎంతోమంది పేద కార్మికులకు అన్నం పెడుతుంది ఈ పరిశ్రమ. దాన వీర సూర కర్ణ,అల్లూరి సీతారామరాజు,మేజర్ చంద్రకాంత్,శివ,సమర సింహ రెడ్డి,ఠాగూర్,పోకిరి,గబ్బర్ సింగ్ మరియు ఈగ,బాహుబలి,బహుబలి 2 లాంటి చిత్రాలతో చరిత్ర సృష్టించిన పరిశ్రమ. 2013 లో భారతదేశానికి సినిమా ద్వారా వచ్చిన ఆదాయంలో 17 శాతం వాటాను కలిగి ఉన్న పరిశ్రమ. అంతే కాకుండా భారతదేశంలో ఎక్కువ ప్రేక్షకాదరణ ఉన్న హిందీ చిత్ర పరిశ్రమకు ధీటుగా నిలుస్తూ విజయవంతంగా ముందుకు నడుస్తున్న మనందరి పరిశ్రమ తెలుగు చిత్ర పరిశ్రమ. ఈ తెలుగు చిత్ర పరిశ్రమను టాలీవుడ్ అని పిలుస్తారు. 


తెలుగు సినిమాలకు పితృ సమానుడిగా రఘపతి వెంకయ్య నాయుడు గారిని కొలుస్తారు. ఈయన 20వ శతాబ్దం మొదట్లో సొంతంగా సినిమాలను తీస్తూ తెలుగు సినిమాలను గురించి తెలియ చేయడానికి ప్రపంచమంతా పర్యటించేవారు. అయితే మొదట్లో అన్ని మూగ సినిమాలు తీసేవారు. హెచ్.ఎమ్.రెడ్డి అనే వ్యక్తి మొదటి తెలుగు-తమిళ్ మోషన్ పిక్చర్ అయిన కాళిదాస్ చిత్రానికి దర్శకత్వం వహించారు. అంతేకాకుండా ఈయన తెలుగులో మంచి విజయం సాధించిన భక్త ప్రహళ్లాద సినిమాకు దర్శకుడు. సి.ఎన్.ఎన్ ఛానల్ ప్రకటించిన 100 భారతదేశ అద్భుత చిత్రాలలో పాతాళ భైరవి,మల్లీశ్వరి,దేవదాసు,మాయాబజార్,నర్తనశాల మరియు మరోచరిత్ర,మా భూమి,సాగర సంగమం,శంకరాభరణం,శివ సినిమాలు నిలిచాయి. 2017 లో విడుదలైన బాహుబలి2 సినిమా భారతదేశంలో అత్యధిక వసూళ్లు రాబట్టిన సినిమాగా నిలిచింది. 2018-2019 సంవత్సరాలలో భారతదేశంలో అత్యధిక ప్రేక్షకాదరణ పొందిన పరిశ్రమలలో బాలీవుడ్ తర్వాతి స్థానంలో టాలీవుడ్ నిలిచింది. 

20వ శతాబ్దంలో నందమూరి తారక రామారావు,అక్కినేని నాగేశ్వరరావు,ఘట్టమనేని కృష్ణ,శోభన్ బాబు,కృష్ణంరాజు,మురళీ మోహన్ లాంటి హీరోల చిత్రాలు ప్రేక్షకులను అద్భుతంగా అలరించేవి.  

మొదట్లో బ్లాక్ అండ్ వైట్ 35mm సినిమాలు సినిమా థియేటర్లలో విడుదల చేసేవారు. మొదటి తెలుగు సినిమా స్కోప్ చిత్రాన్ని హీరో  కృష్ణ అల్లూరి సీతారామరాజు చిత్రంతో మన ముందుకు తీసుకొచ్చారు. అంతే కాకుండా మొదటి 75 mm చిత్రాన్ని సింహాసనం చిత్రం ద్వారా హీరో కృష్ణ మన ముందుకు తీసుకు వచ్చారు.అంతేకాకుండా మొదటి డి.టి.ఎస్ చిత్రాన్ని తెలుగు వీర లేవరా సినిమా ద్వారా హీరో కృష్ణ మనకు పరిచయం చేసారు. 

తెలుగు సినీ పరిశ్రమలో ప్రస్తుతం సురేష్ ప్రొడక్షన్స్,గీత ఆర్ట్స్,వైజయంతి మూవీస్,శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్,ఆర్కా మీడియా,మైత్రి మూవీస్,యూవీ క్రియేషన్స్,14 రీల్స్ లాంటి సంస్థలు పెద్ద చిత్రాలను నిర్మిస్తున్నాయి. 

చిరంజీవి,బాలకృష్ణ,నాగార్జున,వెంకటేష్,పవన్ కళ్యాణ్,మహేష్ బాబు,ప్రభాస్,జూనియర్ ఎన్టీఆర్,రామ్ చరణ్,అల్లు అర్జున్ లాంటి హీరోల చిత్రాలు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు సంపాదిస్తున్నాయి. 

అనుష్క శెట్టి,కాజల్ అగర్వాల్,సమంత,తమన్నా,నయనతార,రష్మిక మందాన,నభా నటాషా,కీర్తి సురేష్ లాంటి హీరోయిన్లు అగ్రతారలుగా వెలుగొందుతున్నారు.  
 

24, నవంబర్ 2020, మంగళవారం

అనగనగా రాగ మతిశయిల్లుచుండు తినగ తినగ వేము తియ్యనుండు.

 

సకల ఆరోగ్యదాయిని వేప


ప్రకృతి ప్రసాదించిన ఔషధ చెట్లలో వేపచెట్టు ప్రముఖమైనది. ఈ వేపచెట్టు యొక్క భాగాలను ఔషధ తయారీలో ఉపయోగిస్తారు. అంతేకాకుండా వేపపుల్లతో దంతాలను శుభ్రం చేసుకోవచ్చు. వేప పుల్ల యొక్క రసం శరీరంలోని వ్యర్ధాలను బయటకి పంపించడమే కాకుండా మన ఆరోగ్యాన్ని సురక్షితంగా ఉంచుతుంది. కంటిలో దుమ్ము పడినప్పుడు వేపచుప్ ను కంటిలో వేసి కంటిని పూర్తిగా శుభ్రం చేసుకోవచ్చు. చర్మసౌందర్యానికి ఉపయోగపడే బ్యూటీ ప్రొడక్ట్స్ లో మరియు సబ్బుల తయారీలో కూడా ఈ వేపను ఉపయోగిస్తారు. 


వేపచెట్టు మహోగాని కుటుంబానికి చెందినది. వేపచెట్టుకు పుట్టిల్లుగా భారతదేశం,బంగ్లాదేశ్ మరియు పాకిస్థాన్ దేశాలు ప్రసిద్ధిచెందాయి. వేపచెట్టును సంస్కృతంలో నీమ్ వృక్షం, అరబిక్ లో నీబ్, కన్నడలో వేపు,తమిళంలో వెప్పం, మలయాళంలో ఆర్య వెప్పు అని పిలుస్తారు. ఆఫ్రికాలో దీన్ని నలభై రకాల రోగాలను నయం చేసే చెట్టుగా భావిస్తారు. 

వేప చెట్టు యొక్క ఎదుగుదల చాలా వేగంగా ఉంటుంది. మాములుగా వేపచెట్లు 30 నుండి 40 మీటర్ల ఎత్తు వరకు ఎదుగుతాయి. వేపు చెట్టుకు కొమ్మలు, ఆకులు ఎక్కువగా ఉంటాయి. వేపచెట్టు యొక్క ఎదుగుదలకు కొమ్మలు ఆకులు ప్రముఖ పాత్రను పోషిస్తాయి. వేపచెట్టు కొమ్మలకు బెరడ్లు ఉంటాయి. ఆ బెరడు లోపల చెక్క ఉంటుంది. ఆ చెక్కను ఎక్కువగా ఫర్నిచర్ తయారీలో ఉపయోగిస్తారు.  అంతే కాకుండా వేపచెట్టుకు కాసే కాయలను ఔషధాల తయారీలో వినియోగిస్తారు. 

ఆయుర్వేదంలో వేప చెట్టును సర్వరోగనివారిణిగా భావిస్తారు. చరకుడు అనే ఆయుర్వేదవైద్యుడు వేపచెట్టు గురించి ఇలా అన్నాడు. ఎవరైతే పగటి పూట వేపచెట్టు నీడలో విశ్రమిస్తారో వారు ఎక్కువ కాలం ఆరోగ్యంగా బ్రతుకుతారు. తెలుగువారు సాంప్రదాయబద్ధంగా చేసుకునే ఉగాది పండుగలో ఉగాది పచ్చడిలో పులుపు కోసం వేప పువ్వు వినియోగిస్తారు. వేపపుల్లను పళ్ళు తోముకోవడానికి ఉపయోగిస్తారు. వేపనూనెను సబ్బులు, షాంపూలు, చర్మ సౌందర్య ఔషధాలలో వినియోగిస్తారు.

చర్మవ్యాధులైన గజ్జి, తామర వచ్చినప్పుడు ఈ వేప ఆకుల గుజ్జును పూతగా పూస్తారు. అమ్మవారు వచ్చినప్పుడు  వేపాకులపై పడుకోబెడతారు. పొట్టలో పురుగులు, మధుమేహం వంటి వ్యాధులకు ఔషధంగా ఉపయోగిస్తారు. 


వేపచెట్టు యొక్క ఉపయోగాలు :


1) వేపచెట్టు పువ్వు ను ఉగాది పచ్చడిలో చేదు రుచి కోసం ఉపయోగిస్తారు. 
2) వేప పుల్లను పళ్ళు తోముకోవడానికి ఉపయోగిస్తారు. 
3) వేపను ఆయుర్వేద ఔషధాల తయారీలో ఉపయోగిస్తారు. 
4) వేప చూపును కంటిలోని మలినాలను శుభ్రం చేసుకోవడానికి ఉపయోగిస్తారు. 
5) అమ్మవారు వచ్చినప్పుడు వేప ఆకులపై పడుకోబెడతారు. 
6) మధుమేహం లాంటి వ్యాధుల నివారణకు ఉపయోగిస్తారు. 
7) చర్మ సౌందర్య ఉత్పత్తుల తయారీలో ఉపయోగిస్తారు. 
7) వేపను చెక్కను మంచాలు, కుర్చీల తయారీలో ఉపయోగిస్తారు. 

18, నవంబర్ 2020, బుధవారం

ఖాదీ పరిశ్రమ గ్రామాల సౌరవ్యవస్థకు సూర్యుడు లాంటిది.

గాంధీ మెచ్చిన ఖాదీ


చేతి మగ్గాలపై సహజమైన ఫ్యాబ్రిక్ తో తయారు చేసిన వస్త్రాలను ఖాదీ అంటాం. ఈ ఖాదీ పరిశ్రమలు ఎక్కువగా ఇండియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్ దేశాలలో తయారు చేస్తారు. అంతేకాకుండా ఈ ఖాదీ వస్త్రాలు భారతదేశ శాంతికి చిహ్నాలుగా ప్రతిష్ట పొందాయి. గాంధీ స్వాతంత్ర ఉద్యమంలో ఉన్న సమయంలో స్వదేశీ నినాదం ద్వారా మగ్గంపై ఖాదీని తయారు చేసుకుని వాటిని వాడమని భారతదేశ ప్రజలకు విన్నవించాడు. అంతేకాకుండా మన ప్రస్తుత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా ఈ ఖాదీ వస్త్రాలను ధరించడం ద్వారా తనకు దేశంపై ఉన్న ప్రేమను, స్వదేశీ నినాదాన్ని మనకు తెలియచేస్తున్నారు. 


ఖాదిని ఖద్దర్ అని కూడా అంటారు. మొదట్లో భారతీయ జెండాలో ఈ ఖాదీ చక్రం ఉండేది. కాలక్రమేణ భారతీయ జెండాలో అశోక చక్రాన్ని ఉంచారు. అయితే 20వ శతాబ్దంలో భారతదేశాన్ని ఆక్రమించుకున్న బ్రిటిష్ ప్రభుత్వం పనులకు నిరసనగా విదేశీ వస్తువులను కొనకూడని గాంధీ నినాదాన్ని లేవనెత్తారు, దానికి కారణం బ్రిటిష్ ప్రభుత్వం వేరే దేశాల నుండి బట్టలను కొనుక్కొని వచ్చి వాటినే ఇక్కడ వాడాలని ఆజ్ఞాపించేది. అందుకు వ్యతిరేకంగా భారతీయ ఖద్దర్ నే వాడేవారు. అలా భారతదేశంలో ఖాదీ బట్టలు చాలా ప్రాముఖ్యతను పొందాయి. 

ఈ ఖాదీ బట్టలు యొక్క కఠినమైన ఆకృతి చలికాలంలో చలి నుండి మనల్ని రక్షిస్తుంది. వేసవి కాలంలో ఒంటి చెమటను తగ్గించి ఎల్లప్పుడు తాజాగా ఉండేలా చేస్తాయి.

భారతదేశంలో ఈ ఖాదీ పరిశ్రమలు ఆంధ్రప్రదేశ్, గుజరాత్, హర్యానా, జార్ఖండ్, 
తమిళనాడు రాష్ట్రాలలో ఎక్కువగా ఉన్నాయి. ఈ ఖాదితో హ్యాండ్లూమ్ చీరలు, ధోతిలు, తువ్వాలలు, చంబా రుమాల్, తుస్సర్ చీరలు తయారుచేస్తారు. ఇండియాలో మన్యవర్ అనే కంపెనీ ఖాదీ వస్తువులను తయారు చేస్తూ ప్రపంచవ్యాప్తంగా పేరు గడించింది.

భారతీయ మాస్టర్ చేనేత డిజైనర్ మరియు పద్మశ్రీ గ్రహీత గజమ్ అంజయ్య,  ఇకాట్ ప్రక్రియ ఆధారంగా ఉత్పత్తులను నేయడం ద్వారా ప్రపంచవ్యాప్తంగా పేరు గడించారు. 2017వ సంవత్సరానికి  ఖాదీ ఉత్పత్తులను తయారుచేసే పరిశ్రమలలో మొత్తం 4,60,000 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. భారతదేశంలో 2019 సంవత్సరం నాటికి ఖాదీ వస్తువుల ద్వారా వచ్చే ఆదాయం 3215 కోట్లుగా ఉంది. అయితే భారతప్రభుత్వం ఆ ఆదాయాన్ని 5000 కోట్లకు చేర్చడానికి ప్రయత్నిస్తుంది. 

22, అక్టోబర్ 2020, గురువారం

జీవితం మారథాన్, స్ప్రింట్ కాదు.

ఇవాంకా ట్రంప్


ఆడవాళ్ళని చూడగానే ముందుగా కనిపించేది వాళ్ళ యొక్క అందం. వారి యొక్క  అందంతో ఎదుటివారిని చూపు తిప్పుకోనివ్వకుండా చేసి తమవైపు ఆకర్షించుకునే శక్తి వారి సొంతం. ఎన్నో యుద్ధాలను జయించిన వీరుడైనా సరే ఆడవాళ్ళ అందానికి దాసోహం కావలిసిందే. అయితే కొంతమంది మహిళలు తమ అందంతోనే కాకుండా మంచి పనితనం చూపడం ద్వారా తమకు తామే సాటి అని నిరూపించుకుంటున్నారు. అంతే కాకుండా ఈనాటి మహిళలు రాజకీయాలలోను, వ్యాపారాలలోను మెరుగ్గా రాణిస్తూ అందరిచేత మన్ననలు పొందుతున్నారు. అటువంటి వారిలో ప్రధానంగా మాట్లాడుకోవాల్సిన మహిళ, అమెరికా ప్రస్తుత అధ్యక్షుడైన డోనాల్డ్ ట్రంప్ కూతురు మరియు అతని ప్రధాన సలహాదారు, పారిశ్రామికవేత్త అయిన ఇవాంకా ట్రంప్.    



బాల్యం మరియు విధ్యాబ్యాసం :


ఇవాంకా ట్రంప్ అసలు పేరు ఇవానా మేరీ ట్రంప్ . ఇవాంకా 30 ఆక్టోబర్ 1981న న్యూయార్క్ నగరంలోని మన్ హట్టన్ లో జన్మించింది. ఈమె అమెరికా ప్రస్తుత అధ్యక్షుడైన డోనాల్డ్ ట్రంప్ మరియు ఇవానా అనే దంపతులకు జన్మించింది. ఇవాంకా చాపిన్ స్కూల్ లో తన స్కూలింగ్ పూర్తి చేసింది మరియు వార్ టన్ స్కూల్ అఫ్ ది యూనివర్సిటీ అఫ్ పెన్నీసల్వాని లో తన గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. 



వ్యక్తిగత విషయాలు :


ఇవాంకా 2005లో రియల్ ఎస్టేట్ డెవలపర్ అయిన జారెడ్ కుశ్నేర్ ను ప్రేమించింది. అయితే ఇవాంకా ట్రంప్ ప్రెస్బిటేరియన్ క్రిస్టియన్ కుటుంబానికి చెందిన అమ్మాయి అవడంవల్ల కుశ్నేర్ కుటుంబం తనను కోడలిగా చేసుకోవడానికి ఇష్టపడరు. అప్పుడు ఇవాంకా ట్రంప్ తన ప్రేమను నిలబెట్టుకోవడం కోసం 2009లో జారెడ్ కుశ్నేర్ మతమైన జూవిష్ మతంలోకి మారిపోతుంది. అలా 25 అక్టోబర్ 2009లో వాళ్లిద్దరూ జూవిష్ సాంప్రదాయబద్ధంగా పెద్దల సమక్షంలో ఒకటవుతారు. వీళ్లకు ఇద్దరు అబ్బాయిలు పుట్టారు. 

మోడలింగ్ :


ఇవాంకా స్కూల్ లో చదువుకునేటప్పటి నుండే మోడలింగ్, ర్యాంప్ వాక్స్ చేయడం మొదలు పెట్టింది. తన తల్లితో కలిసి టామీ హిల్ఫైర్ లాంటి కంపెనీల మాగజైన్ లలో తన ఫోటోలతో  అందరికి కనిపించేది. అంతేకాకుండా తన బ్రాండ్ అయిన ఇవాంకా ఫ్యాషన్ ఐటమ్స్ కు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించేది.
  

వ్యాపారం :


తన గ్రాడ్యుయేషన్ చదువు పూర్తయిన తర్వాత ఫారెస్ట్ సిటీ ఎంటర్ ప్రైజస్ అనే కంపెనీలో ప్రాజెక్ట్ మేనేజర్ గా పని చేసింది.
 
ఆ తర్వాత ట్రంప్ ఆర్గనైజషన్ లోని డెవలప్మెంట్ & అక్విజిషన్స్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ గా పని చేసింది.
 
ఇవాంకా 2007లో డైనమిక్ డైమండ్ కార్పొరేషన్ అనే డైమండ్స్ తయారుచేసే కంపెనీతో కలిసి జూవెల్లరీ బిజినెస్ లో అడుగు పెడుతుంది. అలా తన జూవెల్లరీ ని అమెరికాలోనే కాకుండా కెనడా, బెహ్రెయిన్, కువైట్, ఖత్తర్, సౌదీ అరేబియా, దుబాయ్ లోని స్టోర్స్ లో కుడా అమ్మేవారు. 

ఇవాంకా ట్రంప్ ఫ్యాషన్ ఐటమ్స్ పేరుతో క్లాత్, హ్యాండ్ బ్యాగ్స్, షూస్ వంటి వస్తువులను  అమ్మడం మొదలు పెడుతుంది. అయితే ఈ బిజినెస్ మొదలుపెట్టినప్పటి నుండి ఇవాంకాకు వేరే బ్రాండ్స్ ని కాపీ కొడుతున్నారని జంతువుల చర్మంతో వస్తువులు తయారు చేస్తున్నారు అని ఎన్నో విమర్శలు ఎదురవుతాయి. అలా ఈ బిజినెస్ తక్కువ రోజులలోనే మూత పడుతుంది. 

రాజకీయం :


ఇవాంకా 2016లో తన తండ్రి అమెరికా అధ్యక్ష అభ్యర్థిత్వానికి మద్ధతుగా దేశంలోని పలు చోట్ల ప్రచారం చేస్తుంది. అలా 2016 అమెరికా ఎలెక్షన్స్ లో తన తండ్రి గెలుపుకు ప్రధాన పాత్ర పోషించింది. అమెరికా అధ్యక్షుడిగా డోనాల్డ్ ట్రంప్ ఎన్నిక  అయినప్పటి నుండి తను చేసే ప్రతి కార్యక్రమంలోను పాల్గొనేది. డోనాల్డ్ ట్రంప్ అప్పుడప్పుడు చేసే తప్పులను సరిచేసుకుంటూ తన తండ్రి వెన్నంటే ఉండేది. అలా 29 మార్చి 2017న డోనాల్డ్ ట్రంప్ అంతర్గత సలహాదారుగా నియమించబడింది. అంతేకాకుండా ఇవాంకా ఈ పదవిని చేపట్టడం ద్వారా ఫెడరల్ ఉద్యోగిగా మారుతుంది. ఇవాంకాను ప్రధాన సలహాదారుగా నియమించడం పై విమర్శలు రావడంతో తను ఒక్క డాలర్ జీతం కూడా తీసుకోకుండా పని చేస్తాను అని  ఒప్పుకుంటుంది. 

ఇవాంక ట్రంప్ యొక్క ప్రస్తుత నికర ఆదాయం 300 మిలియన్ డాలర్లు గా ఉంది. 

దానాలు :


ఇవాంకా ఛాయ్ లైఫ్ లైన్ అనే చిన్నపిల్లలకు కాన్సర్ ట్రీట్మెంట్ చేయించే సంస్థకు ప్రతి సంవత్సరం విరాళాలు ఇస్తుంది. 

ట్రంప్ ఫౌండేషన్ ద్వారా ఇంకా ఎన్నో విరాళాలు ఇస్తుంది. 

కోరిన కోర్కెలు తీర్చే కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి.

కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి పూర్వం ద్వారకుడు అనే వ్యక్తి ప్రతి యేటా భక్తి శ్రద్ధలతో ఆ తిరుమల వేంకటేశ్వర స్వామిని దర్శించుకునేవాడు. అయ...