actor లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
actor లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

27, డిసెంబర్ 2020, ఆదివారం

తనదైన శైలిలో ప్రపంచాన్ని ఆకట్టుకుంటున్న సినిమా తెలుగు సినిమా.

తెలుగు సినీ పరిశ్రమ (TFI)


ప్రపంచ పటంలో ఎక్కడో మారుమూల చిన్న పరిశ్రమ. కాని ఈ రోజు ప్రపంచం గర్వించదగ్గ సినిమాలను రూపొందిస్తోంది ఈ పరిశ్రమ. భారత దేశ సినిమా ఖ్యాతిని నలుదిశలకు ప్రసరింప చేస్తూ బలంగా నిలబడింది ఈ పరిశ్రమ. అంతేకాకుండా యువతరానికి నేనున్నాను అన్న భరోసాను కలిగిస్తుంది ఈ పరిశ్రమ. ఎంతో మంది యువ నటీనటులకు,నిర్మాతలకు,దర్శకులకు అవకాశం కల్పిస్తోంది ఈ సినీ పరిశ్రమ. అద్భుతమైన సినిమాలను తెరకెక్కిస్తూ అవి బాక్స్ ఆఫీస్ దగ్గర కోట్ల వర్షం కురిపించేలా చేస్తుంది ఈ పరిశ్రమ. ఎంతోమంది పేద కార్మికులకు అన్నం పెడుతుంది ఈ పరిశ్రమ. దాన వీర సూర కర్ణ,అల్లూరి సీతారామరాజు,మేజర్ చంద్రకాంత్,శివ,సమర సింహ రెడ్డి,ఠాగూర్,పోకిరి,గబ్బర్ సింగ్ మరియు ఈగ,బాహుబలి,బహుబలి 2 లాంటి చిత్రాలతో చరిత్ర సృష్టించిన పరిశ్రమ. 2013 లో భారతదేశానికి సినిమా ద్వారా వచ్చిన ఆదాయంలో 17 శాతం వాటాను కలిగి ఉన్న పరిశ్రమ. అంతే కాకుండా భారతదేశంలో ఎక్కువ ప్రేక్షకాదరణ ఉన్న హిందీ చిత్ర పరిశ్రమకు ధీటుగా నిలుస్తూ విజయవంతంగా ముందుకు నడుస్తున్న మనందరి పరిశ్రమ తెలుగు చిత్ర పరిశ్రమ. ఈ తెలుగు చిత్ర పరిశ్రమను టాలీవుడ్ అని పిలుస్తారు. 


తెలుగు సినిమాలకు పితృ సమానుడిగా రఘపతి వెంకయ్య నాయుడు గారిని కొలుస్తారు. ఈయన 20వ శతాబ్దం మొదట్లో సొంతంగా సినిమాలను తీస్తూ తెలుగు సినిమాలను గురించి తెలియ చేయడానికి ప్రపంచమంతా పర్యటించేవారు. అయితే మొదట్లో అన్ని మూగ సినిమాలు తీసేవారు. హెచ్.ఎమ్.రెడ్డి అనే వ్యక్తి మొదటి తెలుగు-తమిళ్ మోషన్ పిక్చర్ అయిన కాళిదాస్ చిత్రానికి దర్శకత్వం వహించారు. అంతేకాకుండా ఈయన తెలుగులో మంచి విజయం సాధించిన భక్త ప్రహళ్లాద సినిమాకు దర్శకుడు. సి.ఎన్.ఎన్ ఛానల్ ప్రకటించిన 100 భారతదేశ అద్భుత చిత్రాలలో పాతాళ భైరవి,మల్లీశ్వరి,దేవదాసు,మాయాబజార్,నర్తనశాల మరియు మరోచరిత్ర,మా భూమి,సాగర సంగమం,శంకరాభరణం,శివ సినిమాలు నిలిచాయి. 2017 లో విడుదలైన బాహుబలి2 సినిమా భారతదేశంలో అత్యధిక వసూళ్లు రాబట్టిన సినిమాగా నిలిచింది. 2018-2019 సంవత్సరాలలో భారతదేశంలో అత్యధిక ప్రేక్షకాదరణ పొందిన పరిశ్రమలలో బాలీవుడ్ తర్వాతి స్థానంలో టాలీవుడ్ నిలిచింది. 

20వ శతాబ్దంలో నందమూరి తారక రామారావు,అక్కినేని నాగేశ్వరరావు,ఘట్టమనేని కృష్ణ,శోభన్ బాబు,కృష్ణంరాజు,మురళీ మోహన్ లాంటి హీరోల చిత్రాలు ప్రేక్షకులను అద్భుతంగా అలరించేవి.  

మొదట్లో బ్లాక్ అండ్ వైట్ 35mm సినిమాలు సినిమా థియేటర్లలో విడుదల చేసేవారు. మొదటి తెలుగు సినిమా స్కోప్ చిత్రాన్ని హీరో  కృష్ణ అల్లూరి సీతారామరాజు చిత్రంతో మన ముందుకు తీసుకొచ్చారు. అంతే కాకుండా మొదటి 75 mm చిత్రాన్ని సింహాసనం చిత్రం ద్వారా హీరో కృష్ణ మన ముందుకు తీసుకు వచ్చారు.అంతేకాకుండా మొదటి డి.టి.ఎస్ చిత్రాన్ని తెలుగు వీర లేవరా సినిమా ద్వారా హీరో కృష్ణ మనకు పరిచయం చేసారు. 

తెలుగు సినీ పరిశ్రమలో ప్రస్తుతం సురేష్ ప్రొడక్షన్స్,గీత ఆర్ట్స్,వైజయంతి మూవీస్,శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్,ఆర్కా మీడియా,మైత్రి మూవీస్,యూవీ క్రియేషన్స్,14 రీల్స్ లాంటి సంస్థలు పెద్ద చిత్రాలను నిర్మిస్తున్నాయి. 

చిరంజీవి,బాలకృష్ణ,నాగార్జున,వెంకటేష్,పవన్ కళ్యాణ్,మహేష్ బాబు,ప్రభాస్,జూనియర్ ఎన్టీఆర్,రామ్ చరణ్,అల్లు అర్జున్ లాంటి హీరోల చిత్రాలు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు సంపాదిస్తున్నాయి. 

అనుష్క శెట్టి,కాజల్ అగర్వాల్,సమంత,తమన్నా,నయనతార,రష్మిక మందాన,నభా నటాషా,కీర్తి సురేష్ లాంటి హీరోయిన్లు అగ్రతారలుగా వెలుగొందుతున్నారు.  
 

25, అక్టోబర్ 2020, ఆదివారం

మీరు అందరిలాగే ఉండబోతున్నట్లయితే ఈ భూమిపై మనం ఉన్నదానికి అర్ధం ఏముంటుంది.

ఆర్నాల్డ్ స్క్వార్జెనెగ్గర్


ప్రొద్దుట లేచినప్పటి నుండి మరలా రాత్రి పడుకునేంత వరకు రకరకాల ఆలోచనలతో, బాధలతో జీవితాన్ని గడుపుతాం. అటువంటి ఈ జీవితంలో ఏదైనా సాధించాలి, గొప్పగా అవ్వాలి అనుకుంటే మనల్ని ముందుగా పలకరించేవి భయం, అసమర్ధత, నా వల్ల అవుతుందా, నేను సాధించగలనా అనే అనుమానాలే. ఈ ఆధునిక ప్రపంచంలో ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఆవిష్కరణలు, కొత్త కొత్త బ్రాండ్లు రోజుకొకటి పుట్టుకొస్తున్నాయి. అటువంటి ఈ ప్రపంచంలో నీ వల్ల కాదు, నీ వల్ల కాదు అని మనల్ని మనం అసమర్థులుగా మార్చుకుంటున్నాం. ఏదైనా పనిని మొదలు పెట్టి అందులో ఓడిపోతే మన వల్ల కాదు, మనం ఇంకా ఏమి సాధించలేం అని అనుకుంటూ మనల్ని మనం కించపరుచుకుంటూ ముందుకు నడుస్తుంటామ్. అటువంటి ఈ సమాజంలో  పుట్టి చిన్న వయసులోనే బాడీ బిల్డర్ అవ్వాలనే లక్ష్యంతో అమెరికా వచ్చి అక్కడి పోటీల్లో పాల్గొని ప్రపంచ నెంబర్.1 బాడీ బిల్డర్ అవ్వడం. సినిమాలలో నటించి నెంబర్.1 అనిపించుకోవడం. అమెరికా రాజకీయాలలోకి ప్రవేశించి గవర్నర్ గా పదవిని చేపట్టడం. ఎన్నో సార్లు మరెన్నో సార్లు ఓడిపోయినా మళ్ళీ ప్రయత్నించడం. తాను ఏదైతే కావాలనుకున్నాడో, ఏదైతే సాధించాలనుకున్నాడో దాని కోసం బలమైన సంకల్పంతో, కసితో ముందుకు సాగడం. ఇలా అన్ని విషయాలలోను గొప్పగా నిలిచిన అతను మరెవరో కాదు ప్రముఖ బాడీ బిల్డర్, యాక్టర్, రాజకీయవేత్త, వ్యాపారవేత్త అయిన ఆర్నాల్డ్ స్క్వార్జెనెగ్గర్.  



బాల్యం మరియు విధ్యాబ్యాసం :


ఆర్నాల్డ్ స్క్వార్జెనెగ్గర్ అసలు పేరు ఆర్నాల్డ్ అలోయిస్ స్క్వార్జెనెగ్గర్. ఇతను 30 జులై 1947లో ఆస్ట్రియా దేశంలో జన్మించాడు. ఇతను ఆరేలియా మరియు గుస్తావ్ స్క్వార్జెనెగ్గర్ అనే దంపతులకు జన్మించాడు. ఆర్నాల్డ్  తన చదువును ట్రేడ్ స్కూల్ లో పూర్తి చేసాడు. శాంటా మోనిక కాలేజీ యూనివర్సిటీ అఫ్ విస్కాన్సిన్ సుపీరియర్ లో బి.ఏ పూర్తి చేసాడు.

 

వక్తిగత విషయాలు :


ఆర్నాల్డ్ 1986వ సంవత్సరంలో మరియా శ్రీవేర్ అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీళ్లకు నలుగురు పిల్లలు పుట్టారు. 2011వ సంవత్సరంలో వీళ్ళద్దరు విడిపోయారు. 2015 వ సంవత్సరం నుండి తన కంటే వయసులో 27 ఏళ్ళ చిన్నదైన హీథర్ మిల్లిగాన్ అనే అమ్మాయితో సహజీవనం చేస్తున్నాడు. 


 బాడీ బిల్డింగ్ :


బాడీ బిల్డింగ్ చరిత్రలో తమకంటూ గొప్ప గుర్తింపును సంపాదించుకున్న వారిలో ఆర్నాల్డ్ ముందు వరసలో ఉంటాడు. ఆర్నాల్డ్ తన 14 ఏళ్ళ వయసులో ఒలింపిక్స్ గేమ్స్  కోసం వెయిట్ లిఫ్టింగ్ చేయడం మొదలు పెట్టాడు. ఆర్నాల్డ్ 15 ఏళ్ళ వయసులోనే అద్భుతమైన శరీరాన్ని తన సొంతం చేసుకున్నాడు. హాలీవుడ్ యాక్టర్స్ చాలా మంది ముందు బాడీబిల్డర్లు అయ్యి ఆ తర్వాత హీరోస్ గా మారారు అలానే ఆర్నాల్డ్ కూడా అవ్వాలనుకుంటాడు. అలా తన 18 ఏళ్ళ వయసులో ఆస్ట్రియా నుండి అమెరికా వచ్చేస్తాడు. అమెరికా వచ్చిన ఆర్నాల్డ్ ప్రొఫెషనల్ బాడీ బిల్డర్ అవ్వాలనే కసితో రోజుకు 6 గంటలు కష్టపడే వాడు. తనలో ఉన్న పట్టుదలను చుసిన బాడీ బిల్డింగ్ ట్రైనర్ జోయీ వెల్డర్ ఆర్నాల్డ్ ని  గొప్పగా ప్రోత్సహించేవాడు. 

అలా ఆర్నాల్డ్ 2 సార్లు పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్ గాను, 2 సార్లు వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్ గాను ఎన్నికయ్యాడు. అంతే కాకుండా మిస్టర్ యూనివర్స్ గా 4 సార్లు ఎన్నికయ్యాడు. 7 సార్లు మిస్టర్ ఒలింపియా గా కూడా ఎన్నికయ్యాడు. 

1980వ సంవత్సరంలో తన 33వ యేట బాడీబిల్డింగ్ కి రిటైర్మెంట్ ప్రకటించాడు. 

అమెరికాలో ప్రతి ఏటా ఆర్నాల్డ్ క్లాసిక్ అనే పేరుతో బాడీబిల్డింగ్ ఛాంపియన్ షిప్ ని నిర్వహిస్తున్నారు. 

సినిమా యాక్టింగ్ :


బాడీబిల్డర్ గా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ఆర్నాల్డ్  1970లో హెర్క్యూలేస్ ఇన్ న్యూ యార్క్ అనే సినిమాతో హాలీవుడ్ లో అడుగుపెట్టాడు. అయితే తను మొదటి నుండి బాడీబిల్డర్ కావడంతో యాక్టింగ్ చేయడం చాలా ఇబ్బందయ్యేదని, తన భాష కూడా సరిగ్గా ఎవరికి అర్ధమయ్యేది కాదని ఆర్నాల్డ్ పలు ఇంటర్వూస్ లో చెప్పాడు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా గాని పట్టుదలతో ప్రయత్నించి హాలీవుడ్ సినిమా ప్రపంచంలో తనకంటూ ఒక గొప్ప స్థానాన్ని సంపాదించుకున్నాడు. అలా హాలీవుడ్ హిట్ మూవీస్ అయిన స్టే హంగ్రీ, పంపింగ్ ఐరన్, ది విలన్, ది టెర్మినేటర్, ది రన్నింగ్ మాన్, ట్విన్స్, టోటల్ రీకాల్, టెర్మినేటర్ 2, జూనియర్, ట్రూ లైస్, ఎరేజర్, టెర్మినేటర్ 3, ఎక్సపండబుల్స్, ఎక్సపండబుల్స్ 2, టెర్మినేటర్ డార్క్ ఫేట్ లాంటి ఎన్నో గొప్ప చిత్రాలలో నటించాడు. 

రాజకీయ జీవితం :


ఆర్నాల్డ్ మొట్టమొదటగా అమెరికా వచ్చిన కొత్తలో రిపబ్లికన్ పార్టీ సమావేశాల్లో అధ్యక్ష అభ్యర్థి అయిన నిక్సన్-హంఫ్రీ మాట్లాడడం విన్నాడు. ఆయన సోషలిజం విధానాలతో మాట్లాడడం, స్వేచ్ఛ హక్కుల గురించి మాట్లాడడం, పన్నులు తగ్గించడం, మిలటరీ బలోపేతం గురించి మాట్లాడడం ఇవన్ని ఆర్నాల్డ్ లో తెలియని ఉద్రేకాన్ని కలిగించాయి. అలా తన ఆలోచనలకు తగ్గట్టుగా అతను మాట్లాడం ఆర్నాల్డ్ కి రిపబ్లికన్ పార్టీ పై, హంఫ్రీ పై ఇష్టాన్ని పెంచాయి. అలా ఆర్నాల్డ్ తనను రిపబ్లికన్ మెంబర్ గా అనుకునేవాడు. 

ఆర్నాల్డ్ 1988 ప్రెసిడెంట్ ఎలక్షన్ కాంపెయిన్ లో తను రిపబ్లికన్ మెంబర్ అని ప్రకటించాడు. 
1990 నుండి 1993 వరకు ప్రెసిడెంట్ కౌన్సిల్ ఆన్ ఫీజికల్ ఫిటినెస్ అండ్ స్పోర్ట్స్ విభాగంలో చైర్మన్ గా పనిచేసాడు. 
ఆ తర్వాత గవర్నర్ పెట్ విల్సన్ ఆధ్వర్యంలో నడుస్తున్న క్యాలిఫోర్నియా గవర్నర్ కౌన్సిల్ ఆన్ ఫిజికల్ ఫిటినెస్ అండ్ స్పోర్ట్స్ విభాగంలో ఛైర్మన్ గా పనిచేసాడు. 
1993 నుండి 1994 వరకు రెడ్ క్రాస్ అంబాసిడర్ గా పనిచేసాడు. 
ఇలా ఎన్నో విభాగాలలో రిపబ్లికన్ పార్టీ ద్వారా సేవలందించిన ఆర్నాల్డ్ క్యాలిఫోర్నియా గవర్నర్ గా 2003 నుండి 2011 వరకు పనిచేసాడు. 

వ్యాపారాలు :


బాడీబిల్డర్, సినిమా యాక్టర్, బిజినెస్ మాన్ గానే కాకుండా వ్యాపార రంగంలోను ఆర్నాల్డ్ తనకంటూ ఒక గుర్తింపును సంపాదించుకున్నాడు. 
తను బాడీబిల్డింగ్ చేస్తున్న సమయంలోనే బ్రిక్ వ్యాపారం మొదలు పెట్టి తన మొదటి వ్యాపారంలో గొప్పగా విజయం సాధించాడు. 
రియల్ ఎస్టేట్ వ్యాపారంలో కూడా తనకంటూ ఒక ముద్ర వేసుకున్నాడు. 
1992 లో తన భార్యతో కలిసి రెస్టారెంట్ బిజినెస్ మొదలు పెట్టి విజయం సాధించాడు. 
అలా 2006 నాటికి ఆర్నాల్డ్ నికర ఆదాయం 800 మిలియన్ డాలర్లకు చేరింది. 

కోరిన కోర్కెలు తీర్చే కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి.

కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి పూర్వం ద్వారకుడు అనే వ్యక్తి ప్రతి యేటా భక్తి శ్రద్ధలతో ఆ తిరుమల వేంకటేశ్వర స్వామిని దర్శించుకునేవాడు. అయ...