wondeful లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
wondeful లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

27, డిసెంబర్ 2020, ఆదివారం

తనదైన శైలిలో ప్రపంచాన్ని ఆకట్టుకుంటున్న సినిమా తెలుగు సినిమా.

తెలుగు సినీ పరిశ్రమ (TFI)


ప్రపంచ పటంలో ఎక్కడో మారుమూల చిన్న పరిశ్రమ. కాని ఈ రోజు ప్రపంచం గర్వించదగ్గ సినిమాలను రూపొందిస్తోంది ఈ పరిశ్రమ. భారత దేశ సినిమా ఖ్యాతిని నలుదిశలకు ప్రసరింప చేస్తూ బలంగా నిలబడింది ఈ పరిశ్రమ. అంతేకాకుండా యువతరానికి నేనున్నాను అన్న భరోసాను కలిగిస్తుంది ఈ పరిశ్రమ. ఎంతో మంది యువ నటీనటులకు,నిర్మాతలకు,దర్శకులకు అవకాశం కల్పిస్తోంది ఈ సినీ పరిశ్రమ. అద్భుతమైన సినిమాలను తెరకెక్కిస్తూ అవి బాక్స్ ఆఫీస్ దగ్గర కోట్ల వర్షం కురిపించేలా చేస్తుంది ఈ పరిశ్రమ. ఎంతోమంది పేద కార్మికులకు అన్నం పెడుతుంది ఈ పరిశ్రమ. దాన వీర సూర కర్ణ,అల్లూరి సీతారామరాజు,మేజర్ చంద్రకాంత్,శివ,సమర సింహ రెడ్డి,ఠాగూర్,పోకిరి,గబ్బర్ సింగ్ మరియు ఈగ,బాహుబలి,బహుబలి 2 లాంటి చిత్రాలతో చరిత్ర సృష్టించిన పరిశ్రమ. 2013 లో భారతదేశానికి సినిమా ద్వారా వచ్చిన ఆదాయంలో 17 శాతం వాటాను కలిగి ఉన్న పరిశ్రమ. అంతే కాకుండా భారతదేశంలో ఎక్కువ ప్రేక్షకాదరణ ఉన్న హిందీ చిత్ర పరిశ్రమకు ధీటుగా నిలుస్తూ విజయవంతంగా ముందుకు నడుస్తున్న మనందరి పరిశ్రమ తెలుగు చిత్ర పరిశ్రమ. ఈ తెలుగు చిత్ర పరిశ్రమను టాలీవుడ్ అని పిలుస్తారు. 


తెలుగు సినిమాలకు పితృ సమానుడిగా రఘపతి వెంకయ్య నాయుడు గారిని కొలుస్తారు. ఈయన 20వ శతాబ్దం మొదట్లో సొంతంగా సినిమాలను తీస్తూ తెలుగు సినిమాలను గురించి తెలియ చేయడానికి ప్రపంచమంతా పర్యటించేవారు. అయితే మొదట్లో అన్ని మూగ సినిమాలు తీసేవారు. హెచ్.ఎమ్.రెడ్డి అనే వ్యక్తి మొదటి తెలుగు-తమిళ్ మోషన్ పిక్చర్ అయిన కాళిదాస్ చిత్రానికి దర్శకత్వం వహించారు. అంతేకాకుండా ఈయన తెలుగులో మంచి విజయం సాధించిన భక్త ప్రహళ్లాద సినిమాకు దర్శకుడు. సి.ఎన్.ఎన్ ఛానల్ ప్రకటించిన 100 భారతదేశ అద్భుత చిత్రాలలో పాతాళ భైరవి,మల్లీశ్వరి,దేవదాసు,మాయాబజార్,నర్తనశాల మరియు మరోచరిత్ర,మా భూమి,సాగర సంగమం,శంకరాభరణం,శివ సినిమాలు నిలిచాయి. 2017 లో విడుదలైన బాహుబలి2 సినిమా భారతదేశంలో అత్యధిక వసూళ్లు రాబట్టిన సినిమాగా నిలిచింది. 2018-2019 సంవత్సరాలలో భారతదేశంలో అత్యధిక ప్రేక్షకాదరణ పొందిన పరిశ్రమలలో బాలీవుడ్ తర్వాతి స్థానంలో టాలీవుడ్ నిలిచింది. 

20వ శతాబ్దంలో నందమూరి తారక రామారావు,అక్కినేని నాగేశ్వరరావు,ఘట్టమనేని కృష్ణ,శోభన్ బాబు,కృష్ణంరాజు,మురళీ మోహన్ లాంటి హీరోల చిత్రాలు ప్రేక్షకులను అద్భుతంగా అలరించేవి.  

మొదట్లో బ్లాక్ అండ్ వైట్ 35mm సినిమాలు సినిమా థియేటర్లలో విడుదల చేసేవారు. మొదటి తెలుగు సినిమా స్కోప్ చిత్రాన్ని హీరో  కృష్ణ అల్లూరి సీతారామరాజు చిత్రంతో మన ముందుకు తీసుకొచ్చారు. అంతే కాకుండా మొదటి 75 mm చిత్రాన్ని సింహాసనం చిత్రం ద్వారా హీరో కృష్ణ మన ముందుకు తీసుకు వచ్చారు.అంతేకాకుండా మొదటి డి.టి.ఎస్ చిత్రాన్ని తెలుగు వీర లేవరా సినిమా ద్వారా హీరో కృష్ణ మనకు పరిచయం చేసారు. 

తెలుగు సినీ పరిశ్రమలో ప్రస్తుతం సురేష్ ప్రొడక్షన్స్,గీత ఆర్ట్స్,వైజయంతి మూవీస్,శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్,ఆర్కా మీడియా,మైత్రి మూవీస్,యూవీ క్రియేషన్స్,14 రీల్స్ లాంటి సంస్థలు పెద్ద చిత్రాలను నిర్మిస్తున్నాయి. 

చిరంజీవి,బాలకృష్ణ,నాగార్జున,వెంకటేష్,పవన్ కళ్యాణ్,మహేష్ బాబు,ప్రభాస్,జూనియర్ ఎన్టీఆర్,రామ్ చరణ్,అల్లు అర్జున్ లాంటి హీరోల చిత్రాలు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు సంపాదిస్తున్నాయి. 

అనుష్క శెట్టి,కాజల్ అగర్వాల్,సమంత,తమన్నా,నయనతార,రష్మిక మందాన,నభా నటాషా,కీర్తి సురేష్ లాంటి హీరోయిన్లు అగ్రతారలుగా వెలుగొందుతున్నారు.  
 

21, నవంబర్ 2020, శనివారం

యోగా చేస్తూ మీ శరీరాన్ని, మనసును ధృడంగా ఉంచుకోండి.

యోగా ఆసనాలు


5000 సంవత్సరాల నుండి భారతదేశ సంస్కృతిలో భాగంగా ఎంతో మందికి శారీరక బలాన్ని, మానసిక సంతృప్తిని కలిగించిన పురాతన పద్ధతి యోగా. ప్రతి రోజు ఉదయం లేవగానే యోగాతో మన రోజును ప్రారంభించడం ద్వారా మనం ఆనందంగా మరియు సంతోషంగా మన పనులను చేసుకోగలుగుతాం. అంతే కాకుండా ఉపిరికి సంబంధించిన శారీరక వ్యాధులనుండి కూడా మనల్ని మనం కాపాడుకోగలుగుతాం. వృద్ధాప్యం ద్వారా వచ్చే ముడతలను ఆలస్యంగా రప్పించడానికి మరియు ముఖం ప్రకాశవంతంగా ఉండడానికి ఈ యోగా ఎంతగానో ఉపయోగపడుతుంది.
 

యోగా మన శరీరంలోని అన్ని అవయవాలని ఉత్తేజపరుస్తూ,వాటి యొక్క పనితీరును మెరుగుపరుస్తుంది. యోగాలో భాగమైన ఉఛ్వాస,నిఛ్వాస ప్రక్రియల ద్వారా మన ఊపిరితిత్తులను,శ్వాసక్రియ వ్యవస్థను మెరుగుపరుచుకోవచ్చు. 

పురాతన యోగాలోని కొన్ని రకాలను గురించి తెలుసుకుందాం. 

1) అష్టాంగ యోగా :


ఈ యోగా విధానం పురాతన యోగా ఆసనాలను మనకు అందిస్తుంది. 1970వ సంవత్సర కాలంలో ఈ యోగా విధానాన్ని ఎక్కువ మంది ఇష్టపడేవారు. ఈ యోగా లోని ఫోజులకు  మన ఊపిరి కేంద్ర బిందువుగా ఉంటుంది. 

2) బిక్రమ్ యోగా :


ఈ యోగా విధానాన్ని హాట్ యోగా అని కూడా అంటారు. ఈ యోగాను 105 డిగ్రీల వేడి మరియు 40 శాతం తేమ ఉన్న గదిలో చేస్తారు. ఈ యోగాలో 26 ఆసనాలు ఉంటాయి. 

3) హత యోగా :


ఈ హత యోగా ఒక శారీరక వ్యాయామ విధానం. కొత్తగా ఎవరైనా యోగా మొదలు పెడితే ఇక్కడి నుండే మొదలు పెడతారు.

4) అయ్యంగార్ యోగా :


యోగా మ్యాట్,దుప్పట,కుర్చీలు,బల్లలపై ఉండి చేసే యోగా,అయ్యంగార్ యోగా. 

5) జీవముక్తి యోగా :


ఈ జీవముక్తి యోగాను జపం,ధ్యానం,ప్రాణాయామం,ఆసనం రూపంలో మనం చేస్తాం. అయితే ఈ యోగాను చేయడం కోసం కొంచెం కఠినంగా కష్టపడాలి. 

6) క్రిపాలు యోగా :


ఈ యోగా విధానం,యోగా శరీరానికి ఎంతగా ఉపయోగపడుతుందో తెలియజేస్తుంది. సాధారణంగా ఈ యోగా శ్వాస,చిన్నపాటి భంగిమలను కలిగి ఉంటుంది. 

7) కుండలిని యోగా :


ఈ కుండలిని యోగా యొక్క ముఖ్య ఉద్దేశం మనలో ఉన్న అంతర్ శక్తిని వెలికితీయడం. 

8) శివానంద యోగా :


ఈ ఆసనం 5 నియమాలపై ఆధారపడి పనిచేస్తుంది. అవి ఊపిరి,విశ్రాంతి,
డైట్,వ్యాయామం మరియు ప్రశాంతమైన ఆలోచనలు. 

9) పవర్ యోగా :


ఈ యోగాను 1980లో కొంత మంది అథ్లెటిక్ అధ్యాపకులు కనిపెట్టారు. అయితే ఈ పవర్ యోగా ప్రధమ ఉద్దేశం శరీర దృఢత్వం. 

6, నవంబర్ 2020, శుక్రవారం

ఉద్రేకంగా మరియు ధైర్యంగా ఉండండి. ఎల్లప్పుడూ నేర్చుకోవడం కొనసాగించండి. మీరు నేర్చుకోకపోతే ఉపయోగకరమైన పనులు చేయడం మానేస్తారు.

 సత్య నాదెళ్ల 


పెద్దలు ఎప్పుడు ఒక మాట అంటుంటారు. ఇంట గెలిచి కాదు రచ్చ గెలిచి చూడు అని. మన ఇంట్లో నాలుగు గోడల మధ్య మనం గెలిచి గొప్పవాళ్ళం అని అనిపించుకోవడం కాదు, బయట సమాజంలోకి వెళ్లి నీ కాళ్ళ మీద నువ్వు నిలబడి నీ చుట్టూ ఉన్న వాళ్ళతో గొప్పవాడిని అని అనిపించుకోవడం నిజమైన గెలుపు అని అంటారు. చాలా మంది తమని తాము గొప్పవాళ్ళ గాను సమర్థులుగాను చూపించుకోవడానికి ఎంతగానో ప్రయత్నిస్తారు. కాని కొంత మందికి మాత్రమే ఆ అవకాశం దక్కుతుంది. అటువంటి వాళ్లలో ప్రముఖంగా చెప్పుకోవలసిన వ్యక్తి, భారతీయుడు, 
మైక్రోసాఫ్ట్ సంస్థ యొక్క ప్రధాన కార్య నిర్వాహక అధికారి సత్య నాదెళ్ల. 

                 

బాల్యం మరియు విధ్యాబ్యాసం :


సత్య నాదెళ్ల అసలు పేరు సత్యనారాయణ నాదెళ్ల. సత్య నాదెళ్ల 19 ఆగష్టు 1967న ఆంధ్రప్రదేశ్ లోని (ఇప్పుడు తెలంగాణా)హైదరాబాద్ నగరంలో జన్మించాడు. ఇతను యుగంధర్, ప్రభావతి అనే బ్రాహ్మణ దంపతులకు జన్మించాడు. సత్య తన చదువును హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ లో పూర్తిచేసాడు. మరియు మణిపాల్ ఇన్స్టిట్యూట్ అఫ్ టెక్నాలజీ అనే విద్యా సంస్థలో బ్యాచిలర్ అఫ్ ఇంజనీరింగ్ పట్టాను పొందాడు. సత్య తన మాస్టర్ అఫ్ సైన్స్ డిగ్రీని యూనివర్సిటీ అఫ్ విస్కాన్సిన్ లో పొందాడు. అంతే కాకుండా యూనివర్సిటీ అఫ్ చికాగోలో తన ఎంబీఏ డిగ్రీని కూడా పొందాడు. 


వ్యక్తిగత విషయాలు : 


సత్య 1992లో అనుపమ అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. వీళ్లకు ముగ్గురు పిల్లలు పుట్టారు. సత్య చిన్నప్పటి నుండి క్రికెట్ ని ఎంతగానో ఇష్టపడేవాడు. సత్య ఎక్కువగా ఇండియన్ పోయెట్రీ బుక్స్ , అమెరికన్ పోయెట్రీ బుక్స్ ని చదువుతాడు. సత్య సీతల్ సోకర్స్ క్లబ్ కు ఒక యజమానిగా వ్యవహరిస్తున్నాడు. సత్య హిట్ రిఫ్రెష్ అనే బుక్ ని రాసాడు. ఈ బుక్ ద్వారా వచ్చిన డబ్బులను సేవా కార్యక్రమాలకు దానంగా ఇచ్చేసాడు. 

సత్య మొదట్లో సన్ మైక్రోసిస్టమ్స్ అనే కంపెనీలో పనిచేసేవాడు. 

మైక్రోసాఫ్ట్ :


సత్య 1992వ సంవత్సరంలో మైక్రోసాఫ్ట్ కంపెనీలో క్లౌడ్ కంప్యూటింగ్ టెక్నాలజీ డెవలప్మెంట్ లో పని చేసేవాడు. ఆ తర్వాత సత్య మైక్రోసాఫ్ట్ బిజినెస్ డెవలప్మెంట్ టీంకి వైస్ ప్రెసిడెంట్ గా  వ్యవహరించాడు. అంతేకాకుండా మైక్రోసాఫ్ట్ డేటాబేస్, మైక్రోసాఫ్ట్ సర్వర్, డెవలపర్ టూల్స్ యొక్క ఉన్నతిలో ప్రముఖ పాత్ర పోషించాడు. అలా 2011లో 16 బిలియన్ డాలర్లు ఉన్న క్లౌడ్ సర్వీసెస్ ఆదాయాన్ని 20 బిలియన్ డాలర్లకు చేరువయ్యేలా చేసాడు. తద్వారా 2014లో మైక్రోసాఫ్ట్ సీఈఓగా ఎంపికయ్యాడు. అలా మైక్రోసాఫ్ట్ ను ప్రముఖ దిగ్గజ కంపెనీలకు ఏ మాత్రం తగ్గకుండా బలంగా నిలబెట్టాడు. సత్య మైక్రోసాఫ్ట్ సీఈఓగా మోజంగ్, మైన్ క్రాఫ్ట్, క్సమరిన్ లాంటి కంపెనీలను కొని మైక్రోసాఫ్ట్ లో విలీనం చేసాడు. అంతేకాకుండా లింకేడిన్ కంపెనీని 26 బిలియన్లకు కొని మైక్రోసాఫ్ట్ లో విలీనం చేసాడు.   

ఇలా మైక్రోసాఫ్ట్ సీఈఓ గా ఎంతో గొప్ప పేరు సంపాదించిన సత్య, సి.ఎన్.బి.సి నిర్వహించిన వ్యాపార దిగ్గజాలకు ఇచ్చే అవార్డుల కార్యక్రమంలో గ్లోబల్ ఇండియన్ బిజినెస్ ఐకాన్ గా నిలిచాడు.

28, అక్టోబర్ 2020, బుధవారం

తన అందంతో ,ఆకృతితో కోట్ల మంది వీక్షకులను కట్టిపడేసిన కట్టడం ఈఫిల్ టవర్.

ఈఫిల్ టవర్


ప్రపంచంలోని అతి పెద్ద కట్టడాలలో ఒకటైన కట్టడం, కోట్ల మందిని తన అందంతో కట్టిపడేసిన కట్టడం, కట్టి ఎన్నో సంవత్సరాలైనా చెక్కు చెదరకుండా బలంగా నిలబడిన కట్టడం, చరిత్రలో తన కంటూ ఒక ప్రముఖ స్థానాన్ని దక్కించుకున్న కట్టడం, జీవితంలో ఒకసారైనా చూడాల్సిన కట్టడం ప్యారిస్ లో నిర్మించబడిన ఈఫిల్ టవర్ కట్టడం.


ఈఫిల్ టవర్ చరిత్ర :


ఈ ఈఫిల్ టవర్ ఫ్రాన్స్ దేశం, ప్యారిస్ నగరంలోని చాంప్ డే మార్స్ లో ఉంది. ఈ ఈఫిల్ టవర్ ని చేత ఇనుప జాలకం తో నిర్మించారు. ఈ ఈఫిల్ టవర్ ప్రపంచంలోనే 2వ అతి పెద్ద టవర్ గా కీర్తిని గడించింది. 

మారిస్ కొచ్లిన్ మరియు ఎమిలే నౌగియర్ అనే ఇద్దరు డిజైనర్స్  సొసైటీ డి ఎక్స్ప్లోయిటేషన్ డి లా టూర్ ఈఫిల్ అనే కంపెనీలో పని చేసేవారు. ఈ కంపెనీకి బాస్ గుస్తావే ఈఫిల్. వీళ్ళిద్దరూ ఈఫిల్ టవర్ యొక్క డిజైనును రూపొందించారు. డిజైన్ పూర్తయిన వెంటనే ఆ ఇద్దరు డిజైనర్స్ ఆ డిజైన్ ను తమ బాస్ అయిన ఈఫిల్ కి చూపిస్తారు, ఆ డిజైన్ చూసిన ఈఫిల్ కొన్ని మార్పులను చేయమంటాడు. అప్పుడు డిజైనర్స్ ఇద్దరు స్టీఫెన్ సౌవేస్టర్ తో కలిసి బేస్ డిజైన్, డెకరేషన్స్ చేసి పూర్తి డిజైన్ ని ఈఫిల్ కి చూపించి ఆమోదాన్ని పొందుతారు. అసలు ఈ టవర్ కట్టడానికి ప్రధాన కారకుడు ఈఫిల్. ఈఫిల్ న్యూ యార్క్ లో ఉన్నలాటింగ్ అబ్జర్వేటరీ కట్టడాన్ని ప్రేరణగా తీసుకుని దీన్ని నిర్మించాలని అనుకున్నాడు.

ఈఫిల్ ఆమోదాన్ని పొందిన ఈ టవర్ యొక్క ఎత్తు 300 మీటర్లుగా నిర్దారిస్తారు. అయితే మొదట్లో 300 మీటర్ల ఎత్తు గల భవనం యొక్క నిర్మాణం సాధ్యం కాదని అందరూ అనేవారు, కొంతమంది నేరుగానే టవర్ ని నిర్మించాలనుకున్న ఈఫిల్ ని విమర్శించేవారు. కాని ఈఫిల్ వాటిని లెక్క చేయలేదు. ప్రపంచంలోనే అతి పెద్ద టవర్ ని నిర్మించడమే తన లక్ష్యంగా పెట్టుకున్నాడు. అనుకున్నదే తడువుగా ప్రణాళికలను రూపొందించి పనులను చకచకా ముందుకు నడిపించాడు. అయితే ఈ టవర్ యొక్క డిజైన్ నాలుగు వేరువేరు లాటిస్ గిర్డర్ స్థంబాలపై నిలబడి చివర్లో కలిసినట్టుగా ఉండేలా రూపొందించారు.

ఈఫిల్ ఈ డిజైన్ కి ఆమోదాన్ని పొందడమే కాకుండా దీన్ని ఆర్ట్స్ డిజైన్ ఎక్సిబిషన్ లో ప్రదర్శిస్తాడు. అలా మార్చి 30, 1885 న, ఈఫిల్ తన ప్రణాళికలను సొసైటీ డెస్ ఇంజినియర్స్ సివిల్స్‌కు సమర్పిస్తాడు. సాంకేతిక సమస్యలను చర్చించిన తరువాత మరియు టవర్ యొక్క ఆచరణాత్మక ఉపయోగాలను నొక్కిచెప్పిన తరువాత, టవర్ ప్రతీకను గురించి చెప్పి తన ప్రసంగాన్ని ముగిస్తాడు. అలా ఎన్నో ఆమోదాలు పొందిన తర్వాత 28 జనవరి 1887లో ఈ ఈఫిల్ టవర్ కట్టడాన్ని నిర్మించడం మొదలు పెడతారు. 2 సంవత్సరాల పాటు అలుపెరగని నిర్మాణాన్ని జరిపి చివరకు 15 మార్చి 1889లో టవర్ యొక్క నిర్మాణం పూర్తి చేస్తారు. 31 మార్చి 1889లో ఈ ఈఫిల్ టవర్ ని ప్రారంభించారు. ఈఫిల్ టవర్ పై ఏర్పరచిన టిప్ తో కలిసి ఈ టవర్ యొక్క మొత్తం పొడవు 324 మీటర్లుగా నిర్దారించారు.

ఈ టవర్ సందర్శకుల సౌకర్యార్ధం కోసం మూడు స్థాయిలుగా విభజించబడింది. మొదటి స్థాయికి రెండవ స్థాయికి వెళ్ళడానికి మెట్ల సౌకర్యం ఉంది. మొదటి రెండు స్థాయిలలో రెస్టారెంట్స్ ఉంటాయి. మూడవ స్థాయికి వెళ్ళడానికి కూడా మెట్లు ఉన్నాయి కాని ఎక్కువ దూరం కావడం వల్ల సందర్శకులు లిఫ్ట్ లోనే వెళ్తారు. భూమి నుండి మూడవ స్థాయికి ఈ టవర్ ఎత్తు 276 మీటర్లుగా ఉంది.

2015వ సంవత్సరంలో డబ్బులు కట్టి సందర్శించే కట్టడాల్లో 69 లక్షల మంది సందర్శించిన 
అద్భుత కట్టడంగా చరిత్రలో నిలిచింది.

కోరిన కోర్కెలు తీర్చే కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి.

కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి పూర్వం ద్వారకుడు అనే వ్యక్తి ప్రతి యేటా భక్తి శ్రద్ధలతో ఆ తిరుమల వేంకటేశ్వర స్వామిని దర్శించుకునేవాడు. అయ...