తులసి చెట్టు
హిందువుల ఆరాధ్య దైవాలలో ఒకరైన విష్ణువుకు ప్రీతిపాత్రమైన చెట్టు తులసి చెట్టు. తెలుగింటి ఆడపడుచులు తులసి చెట్టును తమ దైవంగా ప్రార్థిస్తారు. తులసి ఆకుల తీర్దాన్ని ప్రతి గుడిలోనూ భక్తులకు అందిస్తారు. తులసి చెట్టు సర్వరోగ నివారిణిగా మనకు ఉపయోగపడుతుంది. తులసి చెట్టు ఉన్న ఇంటిలో త్రిమూర్తులు కొలువుంటారని ప్రతీతి. అంతేకాకూండా 2000 సంవత్సరాల ఆయుర్వేద వైద్యంలో తులసి చెట్టు ప్రముఖ పాత్రను పోషిస్తుంది. అంతేకాకుండా ఔషధాల
తయారీలోను ఈ తులసి ఎంతగానో ఉపయోగపడుతుంది. తులసి చెట్టు ప్రాణవాయువును విడుదల చేస్తుంది. హిందువుల ముఖ్య పండుగలలో తులసి ఆకులను పూజ చేయడానికి ఉపయోగిస్తారు.
బాణాసంచా కాలుస్తూ నిష్ఠగా ఆ పూజను ఆచరిస్తారు. ఉదయాన్నే తులసి చెట్టును దర్శించడం ద్వారా పాపాలు నశిస్తాయి. తులసి చెట్టు ఉన్న చోట దుష్టశక్తులు దరిచేరవు. హిందువుల ఆచార సాంప్రదాయాలలో తులసి చెట్టును విశిష్టంగా వాడతారు. యేసుక్రీస్తును శిలువ వేసిన చోట తులసి చెట్టు మొలచిందని అంటుంటారు.
తులసి చెట్టు యొక్క ఉపయోగాలు :
1) తులసి ఆకులు తినడం ద్వారా జ్ఞాపక శక్తిని పెంచుకోవచ్చు.
2) తులసి ఆకుల రసాన్ని డెంగ్యూ, మలేరియా జ్వరం లాంటి రోగాలను తగ్గించుకోవడానికి ఉపయోగిస్తారు.
3) తులసి ఆకులతో మరిగించిన నీళ్లను తాగడం ద్వారా గొంతు గరగరను తగ్గించుకోవచ్చు.
4) ప్రతి రోజు 5 తులసి ఆకులను ధనియాలు,మిరియాలతో కలిపి మిశ్రమంగా చేసుకుని తింటే పొట్టలోని నులి పురుగులు నశిస్తాయి.
5) రెండు స్పూన్ల తులసి ఆకుల రసాన్ని తేనె కలుపుకుని తాగడం వల్ల పైత్యం తగ్గుతుంది.
6) తులసి ఆకులను నూరి ముఖానికి రాసుకుంటే మచ్చలు, మొటిమలు తొలగిపోతాయి.
7) తులసి ఆకులు తినడం వల్ల చెడు శ్వాస తగ్గుతుంది,
8) తులసి ఆకులను మజ్జిగలో వేసుకుని తాగితే బరువు తగ్గుతుంది.
9) తులసి ఆకులు రోగనిరోధక శక్తిని పెంచుతాయి.
10) తులసి ఆకులను తీసుకుంటే మూత్రపిండాలు శుభ్రమవుతాయి.
11) తులసి ఆకులు తింటే గుండెకు రక్త సరఫరా సక్రమంగా అయ్యేలా చేస్తాయి.
12) ఎన్నో రకాల ఔషధగుణాలు ఉన్న తులసి ఆకులను తిందాం, ఆరోగ్యంగా ఉందాం.