benefits లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
benefits లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

5, జనవరి 2021, మంగళవారం

తులసి మన ఇంట ఆరోగ్యం మన వెంట.

తులసి  చెట్టు


హిందువుల ఆరాధ్య దైవాలలో ఒకరైన విష్ణువుకు ప్రీతిపాత్రమైన చెట్టు తులసి చెట్టు. తెలుగింటి ఆడపడుచులు తులసి చెట్టును తమ దైవంగా ప్రార్థిస్తారు. తులసి ఆకుల తీర్దాన్ని ప్రతి గుడిలోనూ భక్తులకు అందిస్తారు. తులసి చెట్టు సర్వరోగ నివారిణిగా మనకు ఉపయోగపడుతుంది. తులసి చెట్టు ఉన్న ఇంటిలో త్రిమూర్తులు కొలువుంటారని ప్రతీతి. అంతేకాకూండా 2000 సంవత్సరాల ఆయుర్వేద వైద్యంలో తులసి చెట్టు ప్రముఖ పాత్రను పోషిస్తుంది. అంతేకాకుండా ఔషధాల
తయారీలోను ఈ తులసి ఎంతగానో ఉపయోగపడుతుంది. తులసి చెట్టు ప్రాణవాయువును విడుదల చేస్తుంది. హిందువుల ముఖ్య పండుగలలో తులసి ఆకులను పూజ చేయడానికి ఉపయోగిస్తారు.


ప్రతి సంవత్సరం కార్తీక శుక్ల ద్వాదశి రోజున తులసి మాత పూజను హిందువులు భక్తి శ్రద్ధలతో చేస్తారు. ఆ రోజు తులసి చెట్టు చుట్టూ పందిరి వేసి ఆ పందిరిని మావిడాకులతో అలంకరించి,
బాణాసంచా కాలుస్తూ నిష్ఠగా ఆ పూజను ఆచరిస్తారు. ఉదయాన్నే తులసి చెట్టును దర్శించడం ద్వారా పాపాలు నశిస్తాయి. తులసి చెట్టు ఉన్న చోట దుష్టశక్తులు దరిచేరవు. హిందువుల ఆచార సాంప్రదాయాలలో తులసి చెట్టును విశిష్టంగా వాడతారు. యేసుక్రీస్తును శిలువ వేసిన చోట తులసి చెట్టు మొలచిందని అంటుంటారు.

తులసి చెట్టు యొక్క ఉపయోగాలు :


1) తులసి ఆకులు తినడం ద్వారా జ్ఞాపక శక్తిని పెంచుకోవచ్చు. 
2) తులసి ఆకుల రసాన్ని డెంగ్యూ, మలేరియా జ్వరం లాంటి రోగాలను తగ్గించుకోవడానికి ఉపయోగిస్తారు. 
3) తులసి ఆకులతో మరిగించిన నీళ్లను తాగడం ద్వారా గొంతు గరగరను తగ్గించుకోవచ్చు. 
4) ప్రతి రోజు 5 తులసి ఆకులను ధనియాలు,మిరియాలతో కలిపి మిశ్రమంగా చేసుకుని తింటే పొట్టలోని నులి పురుగులు నశిస్తాయి. 
5) రెండు స్పూన్ల తులసి ఆకుల రసాన్ని తేనె కలుపుకుని తాగడం వల్ల పైత్యం తగ్గుతుంది. 
6) తులసి ఆకులను నూరి ముఖానికి రాసుకుంటే మచ్చలు, మొటిమలు తొలగిపోతాయి. 
7) తులసి ఆకులు తినడం వల్ల చెడు శ్వాస తగ్గుతుంది,
8) తులసి ఆకులను మజ్జిగలో వేసుకుని తాగితే బరువు తగ్గుతుంది. 
9) తులసి ఆకులు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. 
10) తులసి ఆకులను తీసుకుంటే మూత్రపిండాలు శుభ్రమవుతాయి. 
11) తులసి ఆకులు తింటే గుండెకు రక్త సరఫరా సక్రమంగా అయ్యేలా చేస్తాయి. 
12) ఎన్నో రకాల ఔషధగుణాలు ఉన్న తులసి ఆకులను తిందాం, ఆరోగ్యంగా ఉందాం.  

15, డిసెంబర్ 2020, మంగళవారం

కోసినప్పుడు కన్నీళ్లు పెట్టించినా తిన్నప్పుడు మాత్రం దీని రుచితో ఔరా అనిపిస్తుంది.

కూరగాయాలకు రారాజు ఉల్లిపాయ


ఎటువంటి వంటలోనైనా ఇది లేకుంటే ఆ వంటకు రుచే వుండదు. ప్రొద్దుటే చేసుకునే టిఫిన్ నుండి సాయంత్రం భోజనం వరకు ఇది లేకుంటే చాలా కష్టం. కూర ఏదైనా సరే దాని రుచిని పెంచడానికి దీనిని వాడవలసిందే. భోజనప్రియులను అకట్టుకోవడానికి దీనిని మన వంటలలో వాడాల్సిందే. ఎన్నో పోషక విలువలు కలిగియున్న ఎంతోమందితో ఔరా అనిపించుకున్న మన వంటింటి నేస్తం ఉల్లిపాయ. 
   

ఉల్లిపాయ యొక్క శాస్త్రీయ నామం ఆలియం సీపా, మరియు ఇది ఆలియేసి కుటుంబంలో ఆలియం ప్రజాతికి చెందినది. ఉల్లిపాయను తెలుగులో ఉల్లిగడ్డ అని కూడా అంటారు. ఉల్లిపాయను ఇంగ్లీషులో ఆనియన్ అని పిలుస్తారు. ఈ ఉల్లిపాయను ఎక్కువగా ప్రతిరోజు వండుకునే వంటలలోను, విందు భోజనాలలోను ఉపయోగిస్తారు. సాధారణంగా ఈ ఉల్లిపాయలు తెల్ల, ఎర్ర రంగులలో ఉంటాయి. మరియు చిన్న, పెద్ద ఆకారాలలో లభిస్తాయి. అంతేకాకుండా ఎక్కువ వాసన, తక్కువ వాసన మరియు తియ్యగా ఉన్న ఉల్లిపాయలు కూడా మనకు లభిస్తాయి.

ఉల్లిపాయకు 5000 సంవత్సరాల చరిత్ర ఉంది. ఉల్లిపాయ భారతదేశంలో పుట్టింది అని కొందరు అంటే, ఇంకొంత మంది పాకిస్తాన్ లో పుట్టింది అని అంటారు. అయితే మొదట్లో ఆసియా లో మాత్రమే పండే ఈ పంటను ప్రస్తుతం ప్రపంచ నలుమూలలా పండిస్తున్నారు. ఉల్లిలో క్యాలరీ శక్తి ఎక్కువ, వేయిస్తే ఈ శక్తి ఇంకా పెరుగుతుంది. ఉల్లిలో గంధకం పాలు ఎక్కువగా ఉంటాయి. అందుకనే వీటిని కోసేటప్పుడు కళ్ళ నుండి నీళ్లు వస్తాయి. అంతేకాకుండా ఉల్లిని ఎక్కువగా తినడం వల్ల గుండె పోటు వచ్చే అవకాశం ఉంది. ఉల్లిపాయలతో చేసే కూర చాలా మంచి రుచిని కలిగిఉంటుంది. అంతే కాకుండా ఉల్లిపాయల రసాన్ని తలపై రాయడం ద్వారా జుట్టు ఎదుగుదలను పెంచుకోవచ్చు.  


ఉల్లిపాయల నుండి వచ్చే ఉల్లికాడలు ఎన్నో పోషకవిలువలు కలిగి ఉంటాయి. ఉల్లికాడలను వేడి నీళ్లలో మగ్గించడం ద్వారా వచ్చే రసం మన జీర్ణ వ్యవస్థ ప్రక్రియకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఉల్లిపాయలు తినని వాళ్ళు ఉల్లికాడలను వారి వంటలలో వినియోగించవచ్చు. బరువు తగ్గాలనుకునే వారికి ఈ ఉల్లి కాడలు ఎంతగానో ఉపయోగపడతాయి. ఉల్లి కాడలలో విటమిన్ సి, బీటాకెరెటిన్ లు ఉంటాయి ఇవి మన కొవ్వును తగ్గించడంలో ఉపయోగపడతాయి. గర్భిణీ స్త్రీలు వీటిని తినడం ద్వారా పుట్టబోయే బిడ్డకు వెన్నుముక సమస్యలు తలెత్తకుండా చేయగలుగుతారు. 

కోరిన కోర్కెలు తీర్చే కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి.

కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి పూర్వం ద్వారకుడు అనే వ్యక్తి ప్రతి యేటా భక్తి శ్రద్ధలతో ఆ తిరుమల వేంకటేశ్వర స్వామిని దర్శించుకునేవాడు. అయ...