diet లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
diet లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

2, జనవరి 2021, శనివారం

ప్రొద్దున్నే ఒక గ్లాస్ వాటర్ చేస్తుంది మీ ఆరోగ్యాన్ని పారాహుషార్.

మంచి నీళ్లు తాగండి ఆరోగ్యంగా ఉండండి.


మంచి నీళ్లు ఇది మన ముందు ఉన్న దివ్య ఔషధం. మనిషి శరీరం 60 నుండి 70 శాతం నీటితో తయారు చేయబడి  ఉంటుంది. మనం ఉదయం లేవగానే రెండు గ్లాసుల వాటర్ తాగడం ద్వారా మన శరీరాన్ని శుభ్రం చేసుకోవడంతో పాటు మన రోజూవారి కార్యక్రమాల్లో చాలా ఆరోగ్యంగాను,ఉత్సహాంగాను పాల్గొనగల్గుతాం. అంతేకాకుండా మనం ఈ మంచినీళ్లను క్రమం తప్పకుండా తీసుకోవడం ద్వారా పలు రకాల ఆరోగ్య సమస్యలకు దూరం కావొచ్చు.     



ఉదయం లేవగానే మొదటగా మనం గోరువెచ్చని మంచి నీళ్ళని రెండు గ్లాసులు తీసుకోవాలి. ఒక వేళ మీకు అలా తాగడం కుదరక పోతే ఒక బాటిల్ నిండా మంచి నీళ్ళని పట్టుకుని కొంచెం కొంచెంగా తాగండి,ఉదయాన్నేఇలా చేయడం ద్వారా మన శరీరంలో పోషకాలు పెరగడమే కాకుండా శరీరంలోని మలినాలు  శుభ్రం అవుతాయి. ప్రధానంగా మనం ఈ మంచి నీళ్లు తాగిన 30 నిమిషాల వరకు ఎటువంటి ఆహారం తీసుకోకపోవడం ద్వారా జీర్ణవ్యవస్థను మెరుగ్గా ఉంచుకోవచ్చు. 

ఉదయాన్నే మంచి నీళ్లు తాగడం ద్వారా శరీరం శుభ్రం అవడమే కాకుండా మన ఊపిరితిత్తుల పని తీరును మెరుగు పడుతుంది. ఒక టీస్పూన్ మెంతులు గ్లాస్ వాటర్లో కలుపుకుని తాగడం ద్వారా రక్తపోటు,మధుమేహ వ్యాధులకు దూరంగా ఉండొచ్చు. షుగర్ వ్యాధిని అదుపులో ఉంచుకోవడంకోసం కూడా ఈ మెంతుల వాటర్ ఉపయోగపడుతుంది.

మన శరీరానికే కాకుండా చర్మసౌందర్యానికి కూడా మనం త్రాగే మంచి నీళ్లు ఎంతగానో ఉపయోగపడతాయి. వాటర్ మన శరీరాన్ని హైడ్రేట్ చేయడం ద్వారా చర్మం మరింత ప్రకాశవంతంగా వెలిగేలా చేస్తుంది.

బరువు తగ్గాలనుకునే వాళ్లకు ఈ మంచి నీళ్లు ఎంతగానో ఉపయోగ పడతాయి. ఎటువంటి దుష్ప్రభావాలు లేకుండా శరీరాన్ని తగ్గించుకోవడానికి ఈ వాటర్ ఎంతగానో ఉపయోగపడతాయి.
రోజుకు 8 గ్లాసుల వాటర్ తాగడం ద్వారా మన శరీర జీర్ణవ్యవస్థను చక్కదిద్దుకోవడమే కాకుండా తొందరగా బరువు తగ్గొచ్చు.

కాబట్టి మంచి నీళ్లను నిర్లక్ష్యం చేయకుండా తాగుదాం రోగాలకు దూరంగా ఉందాం.

24, డిసెంబర్ 2020, గురువారం

ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లతో మీ బరువును సునాయాసంగా తగ్గించుకోండి.

ఆరోగ్యకరంగా బరువును తగ్గించుకుందాం.


ఈ రోజుల్లో యువకుల నుండి పెద్దవారి వరకు అధికమైన శరీర బరువు అనేది ప్రధాన సమస్యగా మారింది. మనం లావుగా ఉంటే మనల్ని చూసి ఎంతో మంది హేళన చేస్తారు. బండి మీద మనం తప్పించి వేరేవారు కూర్చోవడానికి అవకాశం ఉండదు. సరిగ్గా పరిగెత్తలేము. ఏదైనా పనిని కొంచెం సేపు చేస్తే ఆయాసం వచ్చేస్తుంది. అంతేకాకుండా శరీరంలో గ్యాస్ పెరిగిపోయి తేన్పులు రావడం, కొవ్వు పేరుకుపోయి గుండెకు రక్తం సక్రమంగా సరఫరా కాకపోవడం లాంటి ఎన్నో ఇబ్బందులు ఎదురవుతాయి. బరువు పెరగడం వల్ల ఇటువంటివే కాకుండా ఇంకా మరెన్నో సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. కాబట్టి మనం మన శరీర బరువును సమానంగా ఉంచుకుంటూ, ఆరోగ్యకరమైన జీవితాన్ని గడుపుదాం.


మన బరువును సమానంగా ఉంచుకుంటూ ఆరోగ్యకరంగా ఉండే కొన్ని విధానాలను తెలుసుకుందాం.


1) సమయానికి ఆహారం తీసుకోవడం. 

2) కాయగూరలు,ఆకు కూరలను ఎక్కువగా తీసుకోవడం. 

3) మంచి నీటిని తరచుగా తాగడం. 

4) కొవ్వు పదార్ధాలైన స్వీట్స్, నెయ్యి లాంటి ఆహారపదార్ధాలను తక్కువగా తినడం. 

5) ఆయిల్ ద్వారా తయారయ్యే వస్తువులైన ఫాస్ట్ ఫుడ్స్, బిర్యానీస్, బజ్జిలు లాంటి వాటిని తినకపోవడం. 

6) ఉదయం టిఫిన్ గా మొలకెత్తిన విత్తనాలను తీసుకోవడం. 

7) మధ్యాహ్నం భోజన సమయంలో కొరలు లేదా దంపుడు బియ్యం ద్వారా వండిన ఆహారాన్ని తీసుకోవడం. 

8) రాత్రి భోజన సమయంలో రెండు చపాతీలు తినడం. 

9) మధ్యలో ఆకలి వేస్తే పండ్లను తినడం. 

10) రాగి జావను తాగడం.

11) క్రమం తప్పకుండా యోగా లేదా వ్యాయామాలు చేయడం  

ఇటువంటి ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను అలవాటు చేసుకొని ఆరోగ్యాన్ని, బరువును సక్రమంగా ఉంచుకోండి.  

 

15, నవంబర్ 2020, ఆదివారం

ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు చేసుకుందాం. శరీరాన్ని బలంగా, ధృఢంగా ఉంచుకుందాం.

ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు


మనిషి పుట్టుక నుండి మరణం వరకు మనిషి జీవితంలో ప్రముఖ పాత్ర పోషించేది ఆహారం, ఒక మనిషికే కాదు ఈ విశ్వంలో ఉన్న అనేకరకాలైన జంతువులు, కీటకాలు, పక్షుల జీవన మనుగడకు ఈ ఆహారం ఎంతగానో అవసరం. ఇలా మనిషి బ్రతకడానికి ఆధారమైన ఈ ఆహారాన్నిసమయానికి తీసుకోకపోవడం, వేరేవారిమీద కోపంతో తినకపోవడం, ఏది పడితే అది తినడం ద్వారా మన ఆరోగ్యాన్ని మనమే పాడుచేసుకుంటున్నాం. ఒక ప్రపంచ సంస్థ ఆహారంపై చేసిన పరిశోధనలలో తెలిసిందేంటంటే, ఒక రోజు ప్రపంచవ్యాప్తంగా మనుషులు వృధా చేసే ఆహారం ఎన్నో లక్షల మందికి కడుపు నింపుతుందని వెల్లడించింది. అంతే కాకుండా ప్రపంచంలో ముందు ముందు రోజుల్లో దారుణమైన ఆహారపు కొరత వచ్చే అవకాశం ఉందని ఆ సంస్థ తన పరిశోధనల ద్వారా వెల్లడించింది.


మన ఆరోగ్యం మనం తీసుకునే ఆహారం మీద ఆధార పడి ఉంటుంది. అటువంటి ఆరోగ్యాన్ని అందించే కొన్ని ఆహార పదార్థాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. 

ఆకుకూరలు, కాయగూరలు, పండ్లు, డ్రైఫ్రూట్స్, విత్తనాలు, చపాతీలు, దంపుడుబియ్యం, మొలకెత్తిన విత్తనాలు మొదలైనవి మంచి పోషకవిలువలు ఉన్న ఆహారపదార్థాలు. 


ఆరోగ్యకరమైన ఆహారపదార్థాలను తీసుకోవడం ద్వారా వచ్చే కొన్ని ఉపయోగాలను తెలుసుకుందాం.


1) మన శరీర బరువును తగ్గించుకోవడంలో ఈ ఆహారపదార్థాలు మనకు ఎంతగానో ఉపయోగపడతాయి. 

2) కాన్సర్ లాంటి ప్రాణాంతక వ్యాధుల నుండి మనల్ని మనం కాపాడుకోవడానికి ఇవి మనకు సహకరిస్తాయి.
 
3) మధుమేహవ్యాధి ద్వారా వచ్చే చెడు దుష్పరిణామాల నుండి మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సహకరిస్తాయి.
 
4) గుండె సంబంధిత వ్యాధులు మరియు గుండె పోటు లాంటి జబ్బుల నుండి మనల్ని మనం కాపాడుకోవడానికి కావలసిన శక్తిని మన శరీరానికి అందిస్తాయి.

5) మన ముందు తరాల వారి యొక్క ఆరోగ్యం సక్రమంగా ఉండడం కోసం మనకు ఈ ఆహార పదార్థాలు ఎంతగానో ఉపయోగపడతాయి. 

6) మన శరీరంలోని ఎముకలు, కండరాలు, దంతాలు బలంగా ఉండడం కోసం ఇవి మనకు సహకరిస్తాయి.
 
7) మన మనసు యొక్క ప్రశాంతతను పెంపొందించడంలో ఈ ఆహార పదార్థాలు మనకు ఎంతగానో సహకరిస్తాయి. 

8) మన యొక్క జ్ఞాపక శక్తి పెరుగుదలకు సహకరిస్తాయి. 

9) రాత్రిపూట ప్రశాంతంగా నిద్రపోవడానికి  సహకరిస్తాయి. 

కోరిన కోర్కెలు తీర్చే కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి.

కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి పూర్వం ద్వారకుడు అనే వ్యక్తి ప్రతి యేటా భక్తి శ్రద్ధలతో ఆ తిరుమల వేంకటేశ్వర స్వామిని దర్శించుకునేవాడు. అయ...