బర్నింగ్ డిజైర్ తెలుగు బ్లాగుకు స్వాగతం. వినోదం, తాజా వార్తలు, ప్రేరణాత్మక, విద్య, ఆహారం వంటి అన్ని రకాల అంశాలపై మేము బ్లాగులను సృష్టిస్తున్నాము. మా ప్రేక్షకులకు పరిజ్ఞానం గల బ్లాగులను అందించడమే మా ప్రధాన లక్ష్యం. మేము మీ సమయాన్ని విలువైనదిగా భావిస్తాము, మేము మీ సమయాన్ని వృథా చేయము. మాకు మద్దతు ఇవ్వండి మరియు మా Burning Desire బ్లాగును ప్రోత్సహించండి.
18, డిసెంబర్ 2020, శుక్రవారం
ఎనిమిది మెదడులు, మూడు గుండెలు, నీలి రక్తం కలిగిన జీవి.
15, డిసెంబర్ 2020, మంగళవారం
కోసినప్పుడు కన్నీళ్లు పెట్టించినా తిన్నప్పుడు మాత్రం దీని రుచితో ఔరా అనిపిస్తుంది.
కూరగాయాలకు రారాజు ఉల్లిపాయ
12, డిసెంబర్ 2020, శనివారం
ఈ నిమిషాన్ని ఆనందంగా గడుపుదాం.
ఈ నిమిషాన్ని ఆనందంగా గడుపుదాం.
ఒక ఊరిలో ఇద్దరు బౌద్ధ సన్యాసులు తమ యొక్క బిక్షాటనను చేస్తుంటారు. అలా నడుచుకుంటూ వెళ్తున్న వాళ్లిద్దరిలో ఒకరు సీనియర్ సన్యాసి ఇంకొకరు జూనియర్ సన్యాసి. ఆ క్రమంలో వాళ్లిద్దరూ నడుచుకుంటూ వెళ్తున్న మార్గంలో ఒక సరస్సు వస్తుంది. అయితే అక్కడ ఒక యువతి నీటిని చూసి భయపడుతూ సరస్సును దాటకుండా అక్కడే ఉండిపోతుంది. అలా భయంతో అక్కడి సరస్సు దగ్గర ఉన్న ఆమెను పట్టించుకోకుండా జూనియర్ సన్యాసి ఆ సరస్సును దాటి వేరే వైపుకు వెళ్ళిపోతాడు.
ఆ తర్వాత అక్కడే ఉన్న సీనియర్ సన్యాసి తనతో పాటు ఆ యువతిని కూడా తీసుకుని వెళ్లి సరస్సును దాటుతాడు. అలా అతను సరస్సును దాటి ఆ యువతిని వేరే పక్కన వదిలేసి తనతో పాటు వచ్చిన జూనియర్ సన్యాసితో కలిసి తన ప్రయాణాన్ని మొదలుపెడతాడు. వాళ్లిద్దరూ అలా నడుచుకుంటూ వెళ్తుంటే జూనియర్ సన్యాసి అదే పనిగా సీనియర్ సన్యాసిని చూసుకుంటూ ముందుకు నడుస్తాడు.
అలా కొంతదూరం వెళ్లిన తర్వాత ఆ జూనియర్ సన్యాసి, సీనియర్ సన్యాసిని ఇలా అడుగుతాడు. మన ధర్మం ప్రకారం ఆడవాళ్లను ముట్టుకోవడం అనేది నిషిద్ధం కదా మరి మీరెందుకు ఆమెను ముట్టుకున్నారు అని అడుగుతాడు. దానికి సమాధానంగా ఆ సీనియర్ సన్యాసి ఇలా అంటాడు. నేను ఆమెను సరస్సు దాటించి అక్కడ వదిలిపెట్టి వచ్చి చాలా సేపు అయ్యింది.
అయినా గాని నువ్వు ఇంకా ఆ విషయం గురించి ఆలోచిస్తూనే ఉన్నావ్. అలా ఎప్పుడో అయిపోయిన విషయం గురించి ఎందుకు ఆలోచించుకుంటూ ముందుకు సాగుతావు. ప్రస్తుతం గురించి ఆలోచించుకుంటూ ముందుకు సాగు అని అంటాడు. మనం కూడా మన జీవితంలో ఎప్పుడైనా ఏదైనా ఒక తప్పు చేస్తే ఎప్పుడు దాని గురించే ఆలోచిస్తూ మనశ్శాంతిని దూరం చేసుకుంటాం.
అలా జరిగిపోయిన విషయాలన్నింటిని గుర్తుకు తెచ్చుకుని ఇలా చేయకుంటే బాగుండును కదా లేదంటే అలా చేయకుంటే బాగుండును కదా అని అదే పనిగా మన జీవితమంతా వాటిని గురించే ఆలోచిస్తూ బ్రతికేస్తుంటాం. ఆ విధంగా మన ప్రస్తుత జీవితాన్ని నాశనం చేసుకుంటాం. కాబట్టి ఎప్పుడో అయిపోయిన విషయాలను గురించి ఆలోచించే శైలిని పోగొట్టుకుని ప్రస్తుత జీవితాన్ని ఆనందంగా గడిపే ఆలోచనాశైలిని అలవరుచుకుందాం. తద్వారా జీవితాన్ని ఆనందంగా గడుపుదాం.
11, డిసెంబర్ 2020, శుక్రవారం
కాలంతో సంబంధం లేని ఆనందం.
కాలంతో సంబంధం లేని ఆనందం
ఒక ఊరిలో రాణి అనే ఆమె ఉండేది. ఆమె ఎప్పుడూ ఏదో ఒక విషయం గురించి ఆలోచించి ఏడుస్తూ ఉండేది. అలా ఎప్పుడు చూసిన ఏడుస్తూ ఉండే ఆమెను చూసి చుట్టుపక్కల వాళ్ళు ఆమెకు ఏడుపురాణి అని పేరుపెడతారు. అయితే ఆ ఊరిలో ఒక వ్యక్తి మాత్రం ఆమె దగ్గరకు వెళ్లి ఆమె ఏడవడానికి గల కారణాన్ని అడుగుతాడు. అప్పుడు ఆమె అతనితో తన బాధకు గల కారణాన్ని చెబుతుంది. నాకు ఇద్దరు కూతుళ్లు. అయితే నా పెద్దకూతురి మొగుడు ఫ్యాన్స్ , కూలర్లు, ఏసీలు అమ్మే వ్యాపారం చేస్తాడు. అందువల్ల అతని వ్యాపారం వేసవికాలంలో చాలా బాగా జరుగుతుంది.
అయితే శీతాకాలంలో అతని వ్యాపారం సరిగ్గా జరగట్లేదు అని బాధ కలిగి ఏడుస్తాను. ఇంక నా రెండవ కూతురి మొగుడు శీతాకాలంలో వేసుకునే స్వేట్టర్స్, దుప్పట్ల వ్యాపారం చేస్తాడు. అందువల్ల అతని వ్యాపారం శీతాకాలంలో చాలా బాగా జరుగుతుంది. అయితే వేసవికాలంలో అతని వ్యాపారం సరిగ్గా జరగట్లేదని బాధ కలిగి ఏడుస్తాను. అని ఆమె బాధకు గల కారణాన్ని అతనికి చెబుతుంది. అలా ఆమె చెప్పిన విషయాన్ని విన్న ఆ వ్యక్తి ఆమెతో ఇలా అంటాడు. నాకు తెలిసిన గురూజీ ఒక ఆయన ఉన్నారు.
ఆయన దగ్గరకు మీరు వెళ్తే అతను మీ సమస్యకు ఖచ్చితంగా పరిష్కారం చెబుతాడు అని అంటాడు. అది విన్న ఆమె వెంటనే అతని దగ్గరకు బయలుదేరుతుంది. అలా అతని దగ్గరకు వెళ్లి ఆమె తన బాధకు గల కారణాన్ని అతనికి వివరిస్తుంది. అది విన్న ఆ గురూజీ ఆమెకు ఒక సలహా ఇస్తాడు. మీ పెద్ద కూతురి వ్యాపారం వేసవికాలంలో మంచిగా నడుస్తుంది కాబట్టి శీతాకాలంలో జరిగే మీ చిన్న కూతురి వ్యాపారం గురించి ఆలోచించడం మానేయండి.
అలానే మీ చిన్న కూతురి వ్యాపారం శీతాకాలంలో బాగుటుంది కాబట్టి వేసవికాలంలో జరిగే మీ పెద్ద కూతురి వ్యాపారం గురించి ఆలోచించడం మానేయండి మీకు ఎటువంటి బాధ ఉండదు అని ఆమెకు చెబుతాడు. అది విన్న ఆమె వేసవికాలంలో చిన్న కూతురి వ్యాపారం గురించి, శీతాకాలంలో పెద్ద కూతురి వ్యాపారం గురించి ఆలోచించడం మానేస్తుంది. అలా ఆమె చేయడం ద్వారా అప్పటి నుండి ఎటువంటి బాధ లేకుండా అనందంగా నవ్వుతూ జీవితాన్ని గడుపుతుంది.
అలా నవ్వుతూ ఉండే ఆమెను చూసిన ఆ చుట్టుపక్కల వాళ్ళు ఆమెను నవ్వుల రాణి అని పిలవడం మొదలుపెడతారు. ఈ కథ ద్వారా మనం తెలుసుకోవాల్సిన నీతి ఏమిటంటే మన జీవితంలో ఆనందం, బాధ అనే రెండు ఉంటాయి. కాబట్టి మనం ఏదో ఒక విషయం గురించి మాత్రమే ఆలోచిస్తూ జీవితాన్ని బ్రతకడం అనేది మంచి పద్ధతి కాదు.
10, డిసెంబర్ 2020, గురువారం
సీతాకోకచిలుక కథ
సీతాకోకచిలుక కథ
ఒక రోజు రాజు అనే వ్యక్తి తన స్నేహితులతో కలసి అడవికి వెళ్తాడు. అలా అడవికి వెళ్లిన అతనికి ఒక చిన్న గూడు కనిపిస్తుంది. ఆ గూడు నుండి ఒక సీతాకోకచిలుక బయటికి రావడానికి ప్రయత్నిస్తుంది. అలా ఆ సీతాకోకచిలుక గూడు నుండి బయటకు రావడానికి ఎంతోసేపు ప్రయత్నించి, ప్రయత్నించి ఇంక శక్తి లేక ఆగిపోతుంది. ఆ విధంగా అక్కడ జరుగుతున్నదంతా దూరం నుండి గమనిస్తున్న ఆ వ్యక్తి సీతాకోకచిలుకకు సహాయం చేయాలనుకుంటాడు. అతను వెంటనే సీతాకోకచిలుక దగ్గరకు వెళ్లి దాని గూడును తొలగిస్తాడు. అలా అతను ఆ గూడును తొలగించిన వెంటనే ఆ సీతాకోకచిలుక చాలా సులువుగా బయటకి వచ్చేస్తుంది.
అయితే బయటకు వచ్చిన సీతాకోకచిలుక యొక్క రెక్కలు, శరీరం సక్రమంగా తయారుకావు, దాని వల్ల అన్ని సీతాకోకచిలుకలలా పైకి ఎగరలేకపోతుంది. అయితే అసలు విషయం ఏమిటంటే సీతాకోకచిలుక గొంగళి నుండి సీతాకోకచిలుకగా మారే క్రమంలో ఒక గూడును కట్టుకుని అందులో నివాసం ఉంటుంది. ఆ విధంగా గూడులో కొన్ని రోజుల పాటు నివాసం ఉన్న ఆ గొంగళి క్రమక్రమంగా సీతాకోకచిలుక రూపంలోకి మారిపోతుంది. అలా సీతాకోకచిలుకగా మారిన గొంగళికి రెక్కలు, శరీరాకృతి రాకుండానే బయటకు రావడానికి ప్రయత్నిస్తుంది.
అలా ఆ సీతాకోకచిలుక బయటకు రావడానికి ప్రయత్నిస్తున్న సమయంలో దాని యొక్క శరీరం, రెక్కలు ఏర్పడి పూర్తి సీతాకోకచిలుకగా మారి దాని గూడును వదిలించుకుని బయటకి వస్తుంది. అయితే ఇది తెలియని ఆ వ్యక్తి ఆ సీతాకోకచిలుక బయటకు రావడానికి ఇబ్బంది పడుతుందని దానికి సహాయం చేస్తాడు. అతను చేసినది మంచి పని అయినా ఆ సీతాకోకచిలుకకు పూర్తిగా రెక్కలు, శరీరాకృతి రాకపోవడం వల్ల దాని జీవితకాలమంతా ఎగరకుండానే ఉండిపోతుంది. ఈ కథ ద్వారా మనం తెలుసుకోవాల్సిన నీతి ఏమిటంటే ప్రతి ఒక్కరికి ఎదుటివారికి ఏదో ఒక విధంగా సాయం చేయాలని ఉంటుంది.
అలా మనం చేసే సాయం వాళ్ళ అభివృద్ధికి ఉపయోగపడితే మంచిదే. కాని మనం చేసే పని వల్ల ఎదుటి వ్యక్తికి ఇబ్బంది కలిగితే మనం చాలా బాధ పడాల్సివస్తుంది. కాబట్టి మనం ఎవరికైనా ఏదైనా సహాయం చేసే ముందు ఒకటికి పది సార్లు అలోచించి చేయడం ద్వారా వాళ్ళను ఆనందంగా ఉంచగలుగుతాం.
9, డిసెంబర్ 2020, బుధవారం
యోగి చెప్పిన నిజమైన సంతోషం
యోగి చెప్పిన నిజమైన సంతోషం
ఒక ఊరిలో ఒక ముసలివాడు ఉండేవాడు. అతను ఆ ఊరిలోని వ్యక్తులను నిజమైన సంతోషం అంటే ఏమిటి అని అడుగుతాడు. అలా అతను అడిగిన ప్రశ్నకు ఒక్కొక్కరు ఒక్కొక్క సమాధానం చెబుతారు. అలా వాళ్ళు చెప్పిన సమాధానం ఆ ముసలివాడికి నచ్చకపోతే వాళ్ళని నిందించడం, దూషించడం చేసేవాడు. ఆ విధంగా ఊరిలోని ప్రజలందరిని ఎప్పుడు తిడుతూ వాళ్ళకి విసుగు తెప్పించేవాడు. ఆ విధంగా మెంటల్ మనిషిలాగా మారిన ఆ ముసలివాడిని ఊరిలో నుండి తరిమేయాలని ఆ ఊరి ప్రజలు నిర్ణయించుకుంటారు. కాని ముసలివాడు కదా బయటకి వెళ్లి ఎలా బ్రతుకుతాడు అని ఆ ఊరివారు అతనిని ఊరిలోనే ఉండనిస్తారు.
అలా కొన్ని సంవత్సరాలు గడిచిపోతుంది. ఒక సారి ఆ ముసలివాడు ఊరిలో ఉన్న చిన్న బండరాయిపై కూర్చుని ఉంటాడు. అలా అక్కడ కూర్చున్న ముసలి వాడి ముందు నుండి పక్క ఊరి వ్యక్తి వెళ్తాడు. వెంటనే ఆ ముసలివాడు ఆ ఊరి గుండా వెళ్తున్న ఆ వ్యక్తిని ఆపి అతనిని నిజమైన సంతోషం అంటే ఏమిటి అని అడుగుతాడు. అప్పుడు ఆ వ్యక్తి ముసలి వాడితో ఇలా అంటాడు. నువ్వు అడిగిన ప్రశ్నకు నా దగ్గర సమాధానం లేదు. కాని ఇక్కడకు కొన్ని మైళ్ళ దూరంలో ఒక అడవి ఉంది. అక్కడ ఒక సన్యాసి ఉన్నాడు. అతని దగ్గరకు వెళితే నీ ప్రశ్నకు సమాధానం దొరుకుతుందని చెప్పి అతను అక్కడి నుండి వెళ్ళిపోతాడు.
ఆ మాటలు విన్న ముసలివాడు అడవిలో ఉన్న ఆ యోగిని కలవడానికి వెళ్తాడు. అలా ఆ ముసలి వాడు ఆ యోగి దగ్గరకు వెళ్లి అతనితో ఇలా అంటాడు. ఓ యోగిరాజా నేను నిజమైన సంతోషం అంటే ఏమిటో అని మా ఊరిలోని ప్రతి ఒక్కరిని అడిగాను. అయితే వాళ్లలో ఎవరూ కూడా నా ప్రశ్నకు సరైన సమాధానాన్ని చెప్పలేకపోయారు. అలా ఆ ప్రశ్నకు సమాధానం దొరక్క ఎంతో నిరాశగా, కష్టంగా జీవితాన్ని గడుపుతున్నాను. కాబట్టి నువ్వైనా నా ప్రశ్నకు సమాధానం చెప్పు అని అతనిని అడుగుతాడు. అప్పుడు ఆ యోగి ముసలివాడితో ఇలా అంటాడు.
నిజమైన సంతోషం అనేది మన మనసులోనే ఉంటుంది. మనం ఎప్పుడు కూడా ఎదుటివారిని నిందిస్తూ, బాధ పడుతూ ఉంటే ఆ నిజమైన సంతోషాన్ని పొందలేము. మనం మన చుట్టూ ఉన్న వారిని సంతోషంగా ఉంచుతూ, మన పనిని మనం చేసుకుంటూ ముందుకు సాగడం ద్వారా నిజమైన సంతోషాన్ని పొందగలం. కాబట్టి ఇప్పటి నుండి ఎదుటివారిని నిందించడం మానేసి, నీ పని నువ్వు సక్రమంగా చేసుకుంటూ ఉండు ఆ సంతోషం నీ వెంటే ఉంటుంది అని ఆ యోగి ముసలివాడితో చెబుతాడు. ఆ మాటలు విన్న ముసలివాడు ఎంతో బాధ పడి తను చేసిన తప్పును తెలుసుకుంటాడు. అప్పటి నుండి ఎవరిని నిందించకుండా తన పని తాను చేసుకుంటూ సంతోషంగా జీవితాన్ని గడుపుతాడు.
8, డిసెంబర్ 2020, మంగళవారం
ఏనుగు మరియు దాని తాడు కథ
ఏనుగు మరియు దాని తాడు కథ
కోరిన కోర్కెలు తీర్చే కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి.
కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి పూర్వం ద్వారకుడు అనే వ్యక్తి ప్రతి యేటా భక్తి శ్రద్ధలతో ఆ తిరుమల వేంకటేశ్వర స్వామిని దర్శించుకునేవాడు. అయ...
-
తులసి చెట్టు హిందువుల ఆరాధ్య దైవాలలో ఒకరైన విష్ణువుకు ప్రీతిపాత్రమైన చెట్టు తులసి చెట్టు. తెలుగింటి ఆడపడుచులు తులసి చెట్టును తమ దైవంగా ప్రా...
-
స్వామి వివేకానంద "లేవండి మేల్కొనండి మరియు మీరు మీ గమ్యాన్ని చేరుకునే వరకు విశ్రమించకండ...
-
మంచి నీళ్లు తాగండి ఆరోగ్యంగా ఉండండి. మంచి నీళ్లు ఇది మన ముందు ఉన్న దివ్య ఔషధం. మనిషి శరీరం 60 నుండి 70 శాతం నీటితో తయారు చేయబడి ఉంటుంది. మన...